మోడల్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచాలి
భానుపురి: మోడల్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్‌తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని తొమ్మిది మోడల్ స్కూళ్లలో సదుపాయాలు, ఉపాధ్యాయులకు ఉన్న అర్హతలు, చదువులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులు మోడల్ స్కూళ్లలో చేరేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆత్మకూర్ (ఎస్)లో పనులు సరిగా జరగకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డీఈఓ అశోక్, ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రవణ్ కుమార్, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.
ఉండ్రుగొండలో కలెక్టర్ పూజలు
చివ్వెంల(సూర్యాపేట) : చివ్వెంల మండలం ఉండ్రుగొండలో మంగళవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చకిలం కృష్ణకుమార్, బందకవి కృష్ణమోహన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment