
అభిమానులు పెద్దఎత్తున క్యూలలో వేచి ఉండి టిక్కెట్లు కొనుగోలు చేశారు.
కొరుక్కుపేట: చైన్నె–హైదరాబాద్ జట్ల మధ్య 21వ తేదీన చేపాక్ స్టేడియం వేదికగా ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు మంగళవారం మ్యాచ్ టికెట్లను విక్రయించారు. దీంతో అభిమానులు పెద్దఎత్తున క్యూలలో వేచి ఉండి టిక్కెట్లు కొనుగోలు చేశారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన విక్రయాలు గంటల వ్యవధిలోనే పూర్తిగా అమ్ముడయ్యాయి. అయితే టికెట్లు కొందరికి అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.