సీ్త్ర ఇతివృత్తంగా
తమిళసినిమా: ‘అమ్మతనం తపస్సు.. పిల్లలు వరం’ అంటారు అలాంటి ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న చిత్రం మిరియమ్మ అన్నారు ఆ చిత్ర దర్శకులు మాలతి నారాయణన్. కడలోర కవితైగళ్ రేఖ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇందులో ఎళిల్ దురై, స్నేహకుమార్, అనితా సంపత్, విజేత ఆషిక్లతో పాటు దర్శకురాలు మాలతి నారాయణన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సాయి ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. జగన్ విలియమ్స్ ఛాయాగ్రహణం, ఏఆర్ రెహానా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర వివరాలను దర్శకులు తెలుపుతూ యుక్త వయసులో ప్రతి యువతి తల్లి కావాలని కోరుకుంటుందన్నారు. అలా సరోగసి విధానం ద్వారా అమ్మ కావడానికి సిద్ధమైన 50 ఏళ్ల సీ్త్ర ఎదుర్కొనే సవాళ్లే మిరియమ్మ చిత్ర కథ అని చెప్పారు. కథ, కథనాలు కొత్గగా ఉంటాయన్నారు. నటి కడలోర కవితైగళ్ రేఖ బలమైన పాత్రలో నటించడంతో చిత్రంపై సినీ వర్గాలు, ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొందన్నారు. చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, కాగా చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను గురువారం విడుదల చేసినట్లు చెప్పారు. నటి రేఖ గెటప్‌కు, ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన. వస్తుందనే ఆనందాన్ని వ్యక్తం చేశారు. మిరియమ్మ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment