సాక్షి, చైన్నె: ఆరు నెలల బిడ్డను మంత్రి పాదాల వద్ద ఉంచి తనను తేనికి బదిలీ చేయాలని ఓ డ్రైవర్ పట్టుబట్టడం కోయంబత్తూరు రవాణా సంస్థలో కలకలం రేపింది. వివరాలు.. కోయంబత్తూరులో బుధవారం రవాణ శాఖ మంత్రి శివశంకర్ కార్యక్రమం జరిగింది. ఇందులో కొత్త భవనాల ప్రారంభోత్సవం, కారుణ్య నియామక ఉత్తర్వులు, పది, ప్లస్–2లో రాణించి రవాణా కార్మికుల పిలల్లకు సత్కారం జరిగింది.
ఈ సందర్భంగా వేదిక మీదకు వచ్చిన ఓ డ్రైవర్ హఠాత్తుగా ఆరు నెలల తన బిడ్డను మంత్రి పాదాల వద్ద ఉంచాడు. తాను సైతం పాదాభివందనం చేసే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన మంత్రి ఆ చంటి బిడ్డను తన చేతుల్లోకి తీసుకున్నారు. అతడి చర్యలతో మంత్రి షాక్‌కు గురయ్యాడు. చివరకు తన వేదనను మంత్రికి వివరించాడు. కోయంబత్తూరులో తాను ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తూ వచ్చినట్టు పేర్కొన్నారు.
'பணியிட மாறுதல் வேண்டும்'
— PuthiyathalaimuraiTV (@PTTVOnlineNews) August 16, 2023
தன் குழந்தையுடன் அமைச்சர் சிவசங்கர் காலில் விழுந்து கோரிக்கை வைத்த ஓட்டுநர் #Kovai | #Coimbatore |#MinisterSivasankar | #Driver pic.twitter.com/cCLm8RJHAb
ఇటీవల తన భార్య బిడ్డకు జన్మనిచ్చి మరణించినట్లు కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలను తాను చూసుకోలేని పరిస్థితి ఉందని, దీంతో స్వగ్రామం తేనిలో ఉన్న తన తల్లికి అప్పగించానని పేర్కొన్నాడు. చిన్న పిల్లలను చూసుకునేందుకు అవకాశం కల్పించాలని, తనను కోయంబత్తూరు నుంచి తేనికి బదిలీ చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని వేడుకున్నారు. అతడి విజ్ఞప్తిని స్వీకరించిన మంత్రి పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment