జిల్లాలో అదనపు పోలింగ్ కేంద్రాలు
వేలూరు: వేలూరు జిల్లాలో 1,200 మంది ఓటర్లకు పైగా ఉన్న ప్రాంతాల్లో అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ సుబ్బలక్ష్మి తెలిపారు. బుధవారం ఉదయం వేలూరు కలెక్టరేట్‌లో పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితా వివరాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీల ప్రతినిధులు జిల్లాలోని పోలింగ్ కేంద్రాలు మార్పుచేయడంతో పాటు నకిలీ ఓటర్లను తొలగించాలని ఎన్నికల కమిషన్‌కు వినతి పత్రాలు సమర్పించారని, వీటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడంతో పాటు ఇదివరకు ఉన్న పోలింగ్ కేంద్రాల్లో 1,200 మంది ఓటర్లు అదనంగా ఉంటే మరొక చోట అదనంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఇందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, చిరునామ వాటిని మార్పు చేసుకునేందుకు ఇప్పటికే ఆయా తాలుకా కేంద్రాలతో పాటు పోలింగ్ కేంద్రాల్లోనూ జాబితాను నోటీస్ బోర్డులో పెట్టామన్నారు. వేలూరు జిల్లాలో మొత్తం ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయని అయితే ఇందులోని ఓటర్ల జాబితాను 23 శాతం ఆధార్ కార్డులో లింక్ చేయకుంటే ఓటరు కార్డు యథావిధిగా తీసివేస్తామన్నారు. వీటిపై రాజకీయ పార్టీ ప్రతినిధులు దృష్టి సారించాలన్నారు. కార్పొరేషన్ కమిషనర్ జానకి, ఎన్నికల ప్రత్యేక అధికారి ముత్తయ్యన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ పీపీ చంద్రప్రకాష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment