మత్తు పదార్థాల విక్రయం
● ఐదుగురి అరెస్ట్
వేలూరు: తిరుపత్తూరు జిల్లా వానియంబాడి ప్రాంతంలో గంజాయి, హాన్స్, గుట్కా వంటి మత్తు పదార్థాలు దుకాణాల్లో జోరుగా విక్రయాలు సాగుతున్నట్లు ఎస్పీ శ్రేయో గుప్తాకు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక పోలీస్ బృందాన్ని నియమించి వీటిపై విచారణ జరపాలని ఎస్పీ ఆదేశించారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం పోలీసులు నేతాజీ నగర్‌లో వాహన తనికీలు నిర్వహించారు. ఆ సమయంలో పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించిన అదే ప్రాంతానికి చెందిన గౌతమ్, సంతోష్, సెల్వన్, వినాయకం, రాజేష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. విచారణలో వీరు సిగిరెట్‌లో గంజాయి పెట్టి విక్రయిస్తున్నట్లు తెలిసింది. అనంతరం వారు వద్ద ఉన్న రెండు కిలోల గంజాయి, హాన్స్, గుట్కా, రూ.10,500 వేల నగదు, తొమ్మిది సెల్‌ఫోన్‌లు, రెండు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఐదుగురు కలిసి ప్రతిరోజూ రైల్యేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో ప్రయాణికులకు మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసి ఆంబూరు కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment