నిషేధిత తాబేళ్ల అక్రమ రవాణా
సేలం: బ్యాంకాక్ నుంచి శ్రీలంక మార్గంగా మదురైకి శ్రీలంక ఎయిర్‌లైన్స్ విమానం వచ్చింది. అందులో వచ్చిన 100 మందికి పైగా ప్రయాణికుల వద్ద కస్టమ్స్ అధికారులు సోదాలు చేశారు. అప్పుడు వేలూరుకు చెందిన ఒక ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేయగా అందులో అటవీ శాఖ నిషేధిత అరుదైన తాబేళ్లు 52, బల్లులు 4, చిన్న పాములు 8 ఉన్నట్టు గుర్తించారు. అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని ఆ ప్రయాణికుడి వద్ద విచారించగా, అతను శ్రీలంక నుంచి బయలుదేరే సమయంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి తన వద్ద ఈ లగేజీలో చాక్లెట్లు ఉన్నట్టుగాను, మదురై విమానాశ్రయం వద్ద ఉండే వ్యక్తికి అప్పగించాలని కోరాడని విచారణలో తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment