వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి
తిరువళ్లూరు: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో నలుగురు మృతి చెందిన సంఘటన విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా వెంగల్ గ్రామానికి చెందిన ఐటీఐ విద్యార్థి శబరినాథన్(19). వెంగల్ సమీపంలోని ఆవాజీపేట గ్రామానికి చెందిన ప్లస్‌ఒన్ విద్యార్థి జగదీష్(16). ఇద్దరూ పాక్కంలోని సేవాలయ విద్యాసంస్థలో చదువుతున్నారు. బుధవారం సాయంత్రం పాఠశాల ముగించుకుని ద్విచక్ర వాహనంలో పాక్కం నుంచి వెంగల్‌కు బయలుదేరారు. తామరపాక్కం క్రాస్‌రోడ్డు వద్ద వెళుతుండగా ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. అదేసమయంలో పెద్దపాళ్యం నుంచి వెంగల్ వైపు వస్తున్న లారీ వారి పైకి దూసుకెళ్లడంతో సంఘటన స్థలంలోనే ఇద్దరూ మృతిచెందారు. పోలీసులు కేసు దర్యాప్తును చేపట్టారు.
లిఫ్ట్ వైర్ తెగిన ప్రమాదంలో ఒకరు: లిఫ్ట్‌వైర్ తెగి పడడంతో కార్మికుడు మృతి చెందాడు. తిరువళ్లూరు జిల్లా తిరువేళాంగాడు యూనియన్ కారణినిజాంపట్టు గ్రామానికి చెందిన మణిగండన్(33). ఇతడికి మీనా అనే భార్య, లలిత్(03), భవ్యశ్రీ(01) అనే ఇద్దరు పిల్లలు వున్నారు. ఇతను ముగ్గుపిండి, ఉప్పు సైకిల్‌పై గ్రామాల్లో విక్రయించడం, రాత్రి కారణినిజాంపట్టులోని విజయ మెటల్ కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి కంపెనీలో పనిచేస్తున్న సమయంలో హఠాత్తుగా లిఫ్ట్ వైర్ తెగి మణిగండన్‌పై పడడంతో మృతిచెందాడు. గ్రామస్తులు కంపెనీ వద్ద ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఆందోళనకు దిగారు.
బైక్ చోరీ చోరీ చేసి పారిపోతూ.. బైక్ చోరీ చేసి తప్పించుకునే క్రమంలో వేగంగా వాహనాన్ని నడిపి ప్రమాదానికి గురైన యువకుడు మృతిచెందాడు. తిరువళ్లూరు జిల్లా తిరుప్పాచ్చూర్ గ్రామానికి సమీపంలో ఓ యువకుడు ద్విచక్ర వాహనాన్ని వేగంగా నడపడంతో అదుపు తప్పి ప్రమాదానికి గురై మృతి చెందాడు. విచారణలో ద్విచక్ర వాహనం కడంబత్తూరుకు చెందిన గోపినాఽథ్‌కు చెందిందని నిర్ధారించి దర్యాప్తును ప్రారంబించారు. గోపినాఽథ్‌కు చెందిన వాహనాన్ని రాణిపేటకు చెందిన ఆర్ముగం చోరీ చేసి తప్పించుకునే క్రమంలో వేగంగా వాహనాన్ని నడిపి ప్రమాదానికి గురై మృతి చెందినట్టు పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment