రూ.7లక్షలతో డ్రోన్
తిరువళ్లూరు: పది నిమిషాల్లో రెండు ఎకరాల భూమికి పురుగుల మందు చల్లే సామర్థ్యం వున్న యంత్రాన్ని కలెక్టర్ ప్రతాప్ రైతుకు గురువారం ఉదయం అందజేశారు. తిరువళ్లూరు జిల్లాలోని రైతులు ఎక్కువగా వరి పంటలను సాగు చేస్తున్నారు. అయితే వ్యవసాయానికి కూలీలు దొరక్కపోవడంతో వరినాటు, కోత, పురుగుల మందు చల్లడానికి యంత్రాల సాయాన్ని తీసుకుంటున్నారు. ఈక్రమంలోనే భారత్‌దేశానికి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన డ్రోన్ యంత్రాన్ని కలెక్టర్ ప్రతాప్ రైతుకు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పురుగుల మందు చల్లడానికి డ్రోన్ పరికరాన్ని వాడనున్నట్టు తెలిపారు. డ్రోన్‌లో 16 లీటర్ల పురుగుల మందును కలిపి పది నిమిషాల్లో రెండు ఎకరాలకు మందును చల్లవచ్చని తెలిపారు. ఈయంత్రాన్ని వాడడం ద్వారా ఖర్చు తక్కువ కావడంతో పాటు పనులు కూడా త్వరగా పూర్తయ్యే అవకాశం వుందని వ్యాఖ్యానించారు. యంత్రాన్ని ఎకరరాకు రూ.500 చొప్పున చెల్లించి ఆసక్తి వున్న రైతులు అద్దెకు కూడా తీసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment