విజేతలెవరో చెబితే రూ.10 లక్షలు
జ్యోతిష్యులకు భారత నాస్తిక సమాజం సవాల్
పాలకుర్తి టౌన్: ‘దేశంలో, రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయో ఫలితాలు వెలువడకముందే కచి్చతంగా తెలియజేసిన జ్యోతిష్యులను సన్మానించి రూ.10 లక్షల అవార్డు అందజేస్తాం.. అలా కాని పక్షంలో జ్యోతిష్యం తప్పని ఒప్పుకునే ధైర్యం ఉందా? అని భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు గుమ్మడిరాజు సాంబయ్య, ఉప్పులేటి నరేశ్ సవాల్ విసిరారు.
వారు ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తిలో మాట్లాడుతూ 1975లోనే ప్రపంచంలోని 175 మంది శాస్త్రవేత్తలు జ్యోతిష్యం అబద్ధమని ప్రకటన విడుదల చేశారని తెలిపారు. కోట్లాది కిలో మీటర్ల దూరంలోని గ్రహాలు భూమి మీద ఉన్న మానవునిపై ప్రభావం చూపుతాయంటూ ప్రజల అజ్ఞానాన్ని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. సైన్సును ప్రోత్సహించాల్సిన ప్రభుత్వాలు ఈ మోసగాళ్ల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం దారుణమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment