సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 1931 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 23,303 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1931 మందికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 86, 475కు చేరింది. తాజాగా కరోనాతో 11 మంది మృతి చెందగా.. మరణాల సంఖ్య 665కు పెరిగింది.(ఒళ్లునొప్పులన్నీ కరోనా జ్వరంతోనేనా?)
కరోనా నుంచి కొత్తగా 1780 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 63,074 మంది పూర్తిగా కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 22,736 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 15,621 మంది హోం ,ఇతర ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంటున్నారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 72.93(దేశంలో 70.37) శాతంగా ఉంది. తెలంగాణలో ఇప్పటివరకు 6,89,150 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ లో 298, వరంగల్ అర్బన్ 144, రంగారెడ్డి 124, కరీంనగర్ 89 కరోనా కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment