హైదరాబాద్‌లో డీజిల్‌ కొట్టించగానే ఆగిపోతున్న కార్లు.. ప్రశ్నిస్తే.. | Adulteration of diesel Sale in Pedda Amberpet Hyderabad | Sakshi

Hyderabad: డీజిల్‌ కొట్టించగానే ఆగిపోతున్న కార్లు.. ప్రశ్నిస్తే..

Mar 6 2022 6:26 PM | Updated on Mar 6 2022 8:36 PM

Adulteration of diesel Sale in Pedda Amberpet Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాధారణంగా ఇంధనం లేక ఆగిపోయిన వాహనాలకు డీజిల్‌ కానీ, పెట్రోల్‌ కానీ పట్టిస్తే యధావిధిగా స్టార్ట్‌ అవుతాయి. కానీ ఈ పెట్రోల్‌ బంక్‌లో డీజిల్‌, పెట్రోల్‌ పట్టిస్తే మాత్రం ఈ డబ్బులు వృథాగా పోగొట్టుకోవడమే కాక.. వాహన మరమ్మత్తులకు కూడా జేబు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. వివరాల్లోకెళ్తే..

హైదరాబాద్‌ పెద్ద అంబర్‌ పేట్‌లో ఉన్న ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌లో భారీ మోసం వెలుగుచూసింది. నీళ్లతో కలిపిన డీజిల్‌ను వాహనదారులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడ డీజిల్‌ పోయించకున్న వెంటనే వాహనాలు ఆగిపోయినట్లు చెప్తున్నారు. ఇదేంటని డీజిల్‌ని పరీక్షిస్తే లీటర్‌కు మూడొంతుల నీళ్లు కలిపినట్లు తేలింది. ఈ విషయంపై పెట్రోల్‌ బంక్‌ సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వాహనదారులను మోసం చేస్తున్న ఈ బంక్‌ను సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

చదవండి: (గుడ్‌న్యూస్‌: ఆర్టీసీ ప్రయాణికులకు కాఫీ,టీ, స్నాక్స్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement