Union Home Minister Amit Shah Visit Hyderabad On July 29th; Schedule Here - Sakshi
Sakshi News home page

Amit Shah: అమిత్‌ షా తెలంగాణ పర్యటన ఖరారు.. షెడ్యూల్‌ ఇదే

Published Thu, Jul 27 2023 2:29 PM | Last Updated on Thu, Jul 27 2023 2:53 PM

Amit Shah Visit Hyderabad On July 29th Schedule Here - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఎల్లుండి (శనివారం) మధ్యాహ్నం 3:45 గంటలకు ప్రత్యేక విమానంలో అమిత్‌ షా హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు జేఆర్‌సీ కన్వెన్షన్‌లో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, సామాజిక సంఘాల నాయకులతో భేటీ కానున్నారు.

తరువాత సాయంత్రం 5:15 గంటలకు శంషాబాద్‌లోని నోవాటెల్‌కు రానున్నారు. 5:15 నుంచి 8 గంటల వరకు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. అనంతరం రాత్రి తిరిగి ఢిల్లీ వెళ్తారు. ఇదిలా ఉండగా అమిత్‌షా పర్యటన సందర్భంగా ఈనెల 29న ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ ప్లాన్‌ చేస్తోంది. కేంద్ర మంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది.
చదవండి: కాజీపేట స్టేషన్‌లో ట్రాక్‌పైకి వరద నీరు.. పలు రైళ్లు రద్దు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement