
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఆస్ట్రేలియా ఎంబసీని ఏర్పాటు చేసేందుకు పరిస్థితులు అనువుగా ఉన్నాయని, ఈ అంశాన్ని పరిశీలిస్తామని ఆ దేశ హైకమిషనర్ బారీ వో ఫారెల్ తెలిపారు. ఆర్థికమంత్రి హరీశ్‌రావుతో బుధవారం హైదరాబాద్‌లో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. చర్చల్లో భాగంగా దేశంలో కొత్తగా ఆస్ట్రేలియా రాయబార కార్యాలయాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటే హైదరాబాద్‌ను పరిగణనలోకి తీసుకోవాలన్న హరీశ్ విజ్ఞప్తికి ఫారెల్ సానుకూలంగా స్పందించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ కోవిడ్ నుంచి త్వరగా కోలుకుందని, టూరిజం, హాస్పిటాలిటీ రంగాలు పుంజుకుంటున్నాయని హైకమిషనర్‌కు వివరించారు. సోలార్‌పవర్ లాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు. 24 గంటల విద్యుత్, వ్యవసాయం, సాగునీటి రంగాలపై అంశాలను ఫారెల్ అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment