సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలో ఎన్నికల వేళ విషాదకర ఘటన చోటుచేసుకుంది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు కుంజా సత్యవతి హఠాన్మరణం చెందారు. ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందారు. దీంతో, ఆమె మృతి పట్ల బీజేపీ నేతలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి అకాల మరణం చెందారు. కాగా, ఆదివారం రాత్రి ఆమె తన నివాసంలో ఉన్న సమయంలో తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. దీంతో, ఆమెను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు తెలిపారు. ఇక, ఆమె మృతి పట్ల అన్ని రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కుంజా సత్యవతి దంపతులు మొదట్లో సీపీఎం పార్టీలో ఉండేవారు. ఆ తర్వాత దివంగత మహానేత వైఎస్ఆర్ చొరవతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో భద్రాచలం నుంచి సత్యవతి కాంగ్రెస్ టికెట్‌పై గెలిచారు. వైఎస్‌ఆర్ మరణానంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పార్టీలు మారారు. అనంతరం, బీజేపీలో చేరారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆమెకు టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
ఇది కూడా చదవండి: మేనిఫెస్టోలో చెప్పినవీ, చెప్పనివీ అమలు చేశాం
Comments
Please login to add a commentAdd a comment