
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద శ్రీనివాస్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నంకు పాల్పడటం కలకలం రేపింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఇటీవల అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ అతని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పార్టీ ఆఫీసు ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే సమీపంలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుడి స్వస్థలం రంగారెడ్డి జిల్లా యాచారం (మ) తమ్మలోనిగూడెం.
Comments
Please login to add a commentAdd a comment