సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. లిక్కర్ స్కామ్‌లో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్యీ కవితకు సంబంధం ఉందని బీజేపీ ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారంపై కల్వకుంట్ల కవిత క్లారిటీ ఇచ్చారు. కావాలనే కేసీఆర్ ఫ్యామిలీని బీజేపీ బద్నాం చేస్తున్ననది ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కామ్ వ్యవహరంలో భాగంగా సోమవారం ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు కవిత ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. తర్వాత బీజేపీ కార్యకర్తలను రిమాండ్‌కు తరలించకుండా పోలీసులను బీజేపీ నేతలు అడ్డగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత ఇంటి ఎదుట ధర్నాకు యత్నించిన బీజేపీ నేతలపై పోలీసులు హత్యాయత్నం కింద కేసులు నమోదు చేశారు. కాగా, ఈ వ్యవహారంలో పోలీసులు హత్యయత్నం కేసు నమోదు చేయడంపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఈ విషయంపై కేంద్ర పెద్దలు.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీశాయి. ఇదిలా ఉండగా.. కవిత ఇంటిపై బీజేపీ నేతలు దాడికి రావడాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని.. ఎమ్మెల్సీ కవితను కలిశారు. ఈ సందర్భంగా తన సంఘీభావం తెలిపారు.
ఇది కూడా చదవండి: మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. అట్టుడుకుతున్న పాతబస్తీ
Comments
Please login to add a commentAdd a comment