![Coronavirus : 2426 New Cases And 13 Deaths In Telangana - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/11/Corona.jpg.webp?itok=wyqPEMGU)
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 2,426 మందికి కరోనా సోకగా.. 13 మంది మృతి చెందినట్లు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,52,602కు చేరింది. గడిచిన 24 గంటల్లో 2,324 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1,19,467కు పెరిగింది. రాష్ట్రంలో మరణాల సంఖ్య 940గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 32,195గా ఉంది. జీహెచ్ఎంసిలో 338, కరీంనగర్ లో 129, మేడ్చల్ లో 172, నల్గొండలో 164, రంగారెడ్డిలో 216, వరంగల్ అర్బన్ లో 108 కేసులు నమోదయ్యాయి.తెలంగాణలో కరోనా రికవరీ రేటు 78. 28 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment