15న నేవీ రాడార్‌ స్టేషన్‌కు శంకుస్థాపన | Damagundam Navy Radar Foundation Stone Laying Ceremony: Telangana | Sakshi
Sakshi News home page

15న నేవీ రాడార్‌ స్టేషన్‌కు శంకుస్థాపన

Published Fri, Oct 11 2024 4:08 AM | Last Updated on Fri, Oct 11 2024 4:08 AM

Damagundam Navy Radar Foundation Stone Laying Ceremony: Telangana

సీఎం రేవంత్, మంత్రి సురేఖకు ఆహ్వానం

సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 15న వికారాబాద్‌ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలం దామగుండంలో నేవీ రాడార్‌ ప్రాజెక్టు పనుల శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డిని.. ఎమ్మెల్యే  రామ్మోహన్‌ రెడ్డి, రాడార్‌ స్టేషన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రాజ్‌ బీర్‌ సింగ్, నేవీ అధికారులు ఆహ్వానించారు. జూబ్లీహిల్స్‌ లోని సీఎం నివాసంలో గురువారం ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు.

సీఎంతో పాటు అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖకు కూడా వారు ఆహ్వానాన్ని అందజేశారు. ఈ మేరకు మంత్రిని ఆమె నివాసంలో వారు కలుసుకున్న సందర్భంగా.. సురేఖ మాట్లాడుతూ రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటుతో భారత రక్షణ వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందన్నారు. పరిగి నియోజకవర్గ ప్రజలకు ఈ స్టేషన్‌ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. దేశంలోనే రెండో రాడార్‌ స్టేషన్‌ కేంద్రంగా తెలంగాణకు మంచి గుర్తింపు లభిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement