సాక్షి, జమ్మికుంట(కరీంనగర్): కేసీఆర్ ప్రభుత్వం కొనసాగడం రాష్ట్రానికే అరిష్టమని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం జమ్మికుంటలో ని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. సీఎం కేసీఆర్ కుట్రదారుడని, మోసగాడని, అతనికి ప్రజలపై ప్రేమ లేదని ఆరోపించారు. దళితులపై ప్రేమ ఉంటే వారికి జనాభా ప్రాతిపదికన మంత్రి వర్గంలో పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం చెప్పిందే తప్ప మంత్రుల అభిప్రాయాలకు విలువ లేదని అన్నారు.
ఇంటెలిజెన్స్ పోలీసులా.. టీఆర్‌ఎస్ కార్యకర్తలా అంటూ ఘాటుగా విమర్శించారు. ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిస్తేనే ధర్మం గెలుస్తుందని ప్రజల్లో చర్చ జరుగుతోందని తెలిపారు. నియోజకవర్గంలో తిరుగుతున్న మంత్రులు సమావేశాల్లో, సభలో నిధులు ఇస్తామని, భవనాలు కట్టిసామని ప్రజలకు హామీలు ఇస్తున్నారని.. మొత్తం రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ‘నాగార్ణున సాగర్ ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని.. హుజూరా బాద్ మీ జాగీర్ కాదు’ అని అన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీలో చేరిక
మోత్కులగూడెంకు చెందిన యువకులు, స్వాతి గార్డెన్ సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే మహిళలు, యువకులు బీజేపీలో చేరా రు. నాయకులు రాజేందర్‌రెడ్డి, రమేష్, సంపత్‌రావు, మల్లేశ్, పురపాలక సంఘం మాజీ చైర్మన్ శ్రీనివాస్, కోటి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment