Fire Accident in Annapurna Studios Near BiggBoss Set | అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం - Sakshi
Sakshi News home page

అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం

Published Fri, Oct 16 2020 9:19 AM | Last Updated on Fri, Oct 16 2020 3:02 PM

Fire Accident At Annapurna Studios In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది సత్వరమే స్పందించి మంటల్ని ఆర్పివేయడంతో యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్టూడియో యాజమాన్యం ప్రకటించింది. షూటింగ్‌ కోసం వేసిన సెట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదని స్టూడియో నిర్వాహకులు వెల్లడించారు.

బిగ్‌బాస్‌కు ప్రమాదం లేనట్టేనా?
అగ్ని ప్రమాదం నేపథ్యంలో అన్నపూర్ణ సెవన్‌ ఏకర్స్‌ స్టూడియోలో బిగ్‌బాస్‌ షూటింగ్‌ జరుగుతుండటంతో కొంత ఆందోళన నెలకొంది. అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతానికి కుడివైపున బిగ్‌బాస్‌ హౌజ్‌ ఉండటమే దీనికి కారణం. అయితే, మంటలు అదుపులోకి రావడంతో బిగ్‌బాస్‌ నిర్వహణకు ప్రమాదమేమీ లేదని సమాచారం. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారణ చేస్తున్నారు. కాగా, అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని వార్తలు రావడంతో కింగ్‌ నాగార్జున ఆగ్రహం ‍వ్యక్తం చేశారు. అవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపడేశారు. అంతా బాగానే ఉందని, భయ పడాల్సిందేమీ లేదని ట్విటర్‌ వెల్లడించారు.
(చదవండి: లైఫ్‌లో ఎప్పుడూ నిన్ను బాధ‌పెట్ట‌ను: లాస్య)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement