దివ్యాంగ్జన్ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై
కంటోన్మెంట్: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబులిటీస్ (దివ్యాంగ్జన్)కు అవసరమైన సహకారం రాజ్‌భవన్ నుంచి అందిస్తామని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బోయిన్‌పల్లిలోని దివ్యాంగ్జన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మానసిక వైకల్యాన్ని చిన్నతనంలోనే గుర్తిస్తే తగిన చికిత్స ద్వారా మా మూలు స్థితికి తెచ్చే అవకాశం ఉంటుందన్నారు. సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, శిక్షకులను ప్రత్యేకంగా అభినందించారు. దివ్యాంగ్జన్‌లో చదువుతున్న, చికిత్స పొందుతున్న విద్యార్థులు ప్రదర్శి ంచిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.
తోచిన సాయం చేయండి
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ అంతరాలను నివారించాలంటే అందరూ తోచిన సాయం చేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. అవసరమైన వారికి, అణగారిన వర్గాలకు డిజిటల్ పరికరాలు దూరం కావడం మంచిది కాదని, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లవంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పేదలకు కూడా అందాలని ఆమె అన్నారు. రాజ్‌భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ‘డొనేట్ ఏ డివైస్’కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. రామ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ అందజే సిన 20 ల్యాప్‌టాప్‌లు, 2 ట్యాబ్‌లను ఉన్నత విద్య చదువుకుంటున్న పేదలకు ఆమె అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment