
సాక్షి, జూబ్లీహిల్స్: మిసెస్ ఇండియా తెలంగాణ-2020 అందాల కిరీటం కోసం నగర మహిళలు పోటీపడ్డారు. వర్చువల్ పద్ధతిలో నిర్వహించిన ఈ పోటీలో నగరానికి చెందిన హంస ప్రియ టైటిల్ గెలుచుకున్నారు. కేవలం అందం మాత్రమే ప్రాతిపాదిక కాకుండా ప్రతిభ, సామాజిక నిబద్ధత, తెలివితేటలు గీటురాయిగా పోటీలను నిర్వహించామని నిర్వాహకురాలు మమత త్రివేది తెలిపారు. ఈ ఆడిషన్స్, ఈ గ్రూమింగ్ సహా పూర్తి స్థాయిలో వర్చువల్‌గా పోటీ నిర్వహించామని, పోటీదారులు తమ ఇళ్లలో నుంచే ఆన్‌లైన్ ద్వారా పోటీలో పాల్గొన్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment