విద్యాహక్కు చట్టం అమలు ఏ దశలో ఉంది | High Court order to State Govt | Sakshi
Sakshi News home page

విద్యాహక్కు చట్టం అమలు ఏ దశలో ఉంది

Jun 19 2024 4:28 AM | Updated on Jun 19 2024 4:28 AM

High Court order to State Govt

వివరాలు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పిల్లల ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం–2009ను రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఎందుకు అమలుచేయడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అసలు చట్టం అమలు ఇప్పుడు ఏ దశలో ఉందో పూర్తి వివరాలు తెలుసుకొని చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 

‘రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు. చట్టంలో 121 సీ ప్రకారం ప్రైవేట్‌ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు 25 శాతం సీట్లు కేటాయించాల్సి ఉంది. అలా ఎక్కడా జరగడం లేదు. దీనిని ప్రభుత్వం కఠినంగా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలి’అని కోరుతూ న్యాయవాది యోగేష్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. 

ఈ పిటిషన్‌పై ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లో ప్రైవేట్‌ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా ఇస్తున్నట్టు ఎక్కడా లేదని, రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలు ఎంత వరకు వచ్చి0దో చెప్పాలని ఏఏజీ ధర్మాసనం ఆదేశించింది. 

కాగా, విద్యాహక్కు చట్టంపై తమకు సాయం చేసేందుకు అమికస్‌గా నియమితులైన సీనియర్‌ న్యాయవాది సునీల్‌ బి.గణు సేవలను ధర్మాసనం ప్రశంసించింది.  మరో పిటిషన్‌ విచారణ సందర్భంగా ప్రభుత్వ హాస్టళ్లలో బాత్‌రూమ్‌లు, టాయిలెట్లు, పరుపులు, దిండ్లు లాంటి ఏర్పాట్లపై కూడా వివరాలు అందజేయాలని చెబుతూ, విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement