సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. కొత్త సభ్యత్వాలను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మంచిరేవులలోని జూబ్లీహిల్స్-4 ప్లాట్ల అమ్మకంపై కూడా ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టొద్దని ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
కాగా, కొందరు వ్యక్తులు స్వలాభాపేక్షతో సొసైటీని ఆర్థిక వనరుగా మార్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వారు కొన్నేళ్లుగా సొసైటీని తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండగా, ఈ క్రమంలో పాతవారికి స్థలాలు మంజూరు కాకుండానే కొత్తగా సభ్యులను చేర్చుకునే అక్రమానికి తెరలేపారనే విమర్శలు ఉన్నాయి.
సహకార హౌసింగ్ సొసైటీలు ఏవైనా.. సొసైటీలో ఇల్లు లేని వారికి తక్కువ ధరతో స్థలం అందేలా చూడటం, సభ్యులు చెల్లించే సొమ్మును, వారి ప్రయోజనాలను పరిరక్షించడం వాటి విధి. కానీ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అందుకు పూర్తి విరుద్ధంగా తయారైంది. 1962లో ఎంతో మంచి ఉద్దేశంతో ఏర్పాటైన ఈ సొసైటీ.. కొన్నేళ్ల నుంచి రూట్ మార్చుకుంది. చట్టాన్ని పట్టించుకునేది లేదు.. నిబంధనలను అమలు చేసేది లేదు.. పాలక వర్గానికి తోచిందే చట్టం, వారు పెట్టిందే నిబంధన అన్నట్టు మారింది.
ఇదీ చదవండి: ‘జూబ్లీహిల్స్’.. అక్రమాలు ఫుల్!
Comments
Please login to add a commentAdd a comment