సాక్షి, హైదరాబాద్: శ్రీలంకలో అదానీ ప్రాజెక్టుపై రాష్ట్ర ము నిసిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ట్విట్టర్‌లో వ్యంగ్యంగా స్పందించారు. అదానీ ప్రాజెక్టును ‘ప్రభుత్వానికి, ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం’గా శ్రీలంక ప్రభుత్వం చెబుతోందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోమవారం ఉదయం ట్వీట్ చేశారు.
అదానీకి ప్రాజెక్టు కట్టబెట్టాలంటూ ప్రధాని మోదీ తమను బలవంతపెట్టారని గతంలో శ్రీలంక చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. ‘వన్ నేషన్.. వన్ ఫ్రెండ్’అనేది ‘ఎ మిత్ర్ కాల్’లో కొత్త పథకమని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment