
సాక్షి, హైదరాబాద్: కామన్వెల్త్ బంగారు పతక విజేత పీవీ సింధు ఆంధ్రప్రదేశ్ పర్యాటక, క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజాని మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో మంత్రి రోజా కుటుంబ సభ్యులు, పీవీ సింధు కుటుంబ సభ్యులు కలిసి లంచ్ చేశారు.
ఈ సందర్భంగా కామన్వెల్త్ గేమ్స్ సింగిల్స్ ఈవెంట్‌లో తొలి బంగారు పతకం సాధించిన సింధు విజయానికి యావత్ దేశం గర్విస్తోందని మంత్రి రోజా అన్నారు. భవిష్యత్తులో సింధు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించిన సహకారానికి పీవీ సింధు కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి: (Munugode Politics: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి)
Comments
Please login to add a commentAdd a comment