
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా కుటుంబ సమేతంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. మంత్రి రోజాకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. రోజాను కేసీఆర్ దంపతులు సంప్రదాయబద్దంగా బొట్టుపెట్టి సత్కరించారు.
అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులను మంత్రి ఆర్కే రోజా మర్యాదపూర్వకంగా కలిశారు. సినీ పరిశ్రమ నుంచి వెళ్లి ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన రోజాను చిరంజీవి దంపతులు ఈ సందర్భంగా అభినందించారు.
చదవండి: (కేటీఆర్‌ను ఏపీకి ఆహ్వానించిన మంత్రి గుడివాడ అమరనాథ్)