Novatel hotel
-
అమిత్ షా, జూ. ఎన్టీఆర్ భేటీలో వాటి గురించే మాట్లాడారు: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటనలో భాగంగా నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి లంచ్ చేశారు. అమిత్ షా బిజీ షెడ్యూల్ మధ్య జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే వారి భేటీకి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వారిద్దరూ కేవలం సినిమాల గురించి మాత్రమే మాట్లాడుకున్నారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దివంగత ఎన్టీఆర్ సినిమాలు, ఆయన రాజకీయ జీవితం, అందించిన సేవలు గురించి మాత్రమే మాట్లాడుకున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. చదవండి: (కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జూ.ఎన్టీఆర్ భేటీ) -
అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ (ఫొటోలు)
-
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జూ.ఎన్టీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో హీరో జూనియర్ ఎన్టీఆర్ నటన బాగుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అభినందించారు. ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో నోవాటెల్ హోటల్లో అమిత్‌షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు. కొంతసేపు వారు మాట్లాడుకున్నారు. కలిసి భోజనం చేశారు. దాదాపు 11.10 గంటల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ‘‘అత్యంత ప్రతిభావంతుడైన నటుడు, తెలుగు సినిమా తారక రత్నం జూనియర్ ఎన్టీఆర్‌ను ఈ రోజు హైదరాబాద్‌లో కలుసుకోవడం ఆనందంగా ఉంది’’ అంటూ అమిత్‌షా ట్వీట్ చేశారు. అయితే కొంతసేపటి తర్వాత నోవాటెల్ నుంచి బయటికి వచ్చిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో అత్యుత్తమ నటన ప్రదర్శించిన జూనియర్ ఎన్టీఆర్‌ను అభినందించేందుకే ఈ భేటీ జరిగిందని, దీనికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆయన తెలిపారు. అయితే అమిత్‌షా బిజీ షెడ్యూల్ మధ్య జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ కావడంపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. బీజేపీలో చేరాలని, సముచిత ప్రాధాన్యం ఇస్తామని జూనియర్ ఎన్టీఆర్‌ను అమిత్‌షా కోరినట్టుగా ప్రచారం జరుగుతోంది. Had a good interaction with a very talented actor and the gem of our Telugu cinema, Jr NTR in Hyderabad. అత్యంత ప్రతిభావంతుడైన నటుడు మరియు మన తెలుగు సినిమా తారక రత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో ఈ రోజు హైదరాబాద్‌లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది.@tarak9999 pic.twitter.com/FyXuXCM0bZ — Amit Shah (@AmitShah) August 21, 2022 చదవండి: అమిత్‌షాపై ఆ ప్రచారం తప్పు.. భయం వల్లే ఇలా చేస్తున్నారు -
మంత్రి ఆర్కే రోజాని మర్యాదపూర్వకంగా కలిసిన పీవీ సింధు
సాక్షి, హైదరాబాద్: కామన్వెల్త్ బంగారు పతక విజేత పీవీ సింధు ఆంధ్రప్రదేశ్ పర్యాటక, క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజాని మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో మంత్రి రోజా కుటుంబ సభ్యులు, పీవీ సింధు కుటుంబ సభ్యులు కలిసి లంచ్ చేశారు. ఈ సందర్భంగా కామన్వెల్త్ గేమ్స్ సింగిల్స్ ఈవెంట్లో తొలి బంగారు పతకం సాధించిన సింధు విజయానికి యావత్ దేశం గర్విస్తోందని మంత్రి రోజా అన్నారు. భవిష్యత్తులో సింధు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించిన సహకారానికి పీవీ సింధు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (Munugode Politics: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి) -
ఎక్కడికక్కడ అప్రమత్తం .. భద్రత కట్టుదిట్టం
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా కీలక నేతలు హైదరాబాద్‌లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరుకానున్న నేపథ్యంలో.. భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సమావేశాలు జరిగే మాదాపూర్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ)తోపాటు నోవాటెల్, రాజ్‌భవన్, బేగంపేట.. మోదీసభ జరిగే పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో పెద్దయెత్తున భద్రతాబలగాలు మోహరిస్తున్నాయి. స్పెష ల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ), కేంద్ర బలగాలతో కలిసి నాలుగంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం 15 వేల మంది భద్రత, బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. ఎస్పీజీ, ఎన్ఎస్జీ, ఆక్టోపస్, శాంతిభద్రతల విభాగంతో పాటు టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్ విభాగాలు రంగంలోకి దిగుతున్నాయి. నగరవ్యాప్తంగా నిఘా, తనిఖీతోపాటు భారీగా మఫ్టీ పోలీసులను ఏర్పాటు చేశారు. ప్రధాని తిరిగే మార్గాల్లో రూట్పార్టీలు ఉంటాయి. దుర్భేద్యంగా హెచ్ఐసీసీ జాగిలాలతో హెచ్ఐసీసీ, నోవాటెల్ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఎత్తైన భవనాల పైనుంచి రూఫ్‌టాప్ వాచ్ చేస్తున్నారు. పాస్ ఉన్న వాహనాలు, వ్యక్తులను మాత్రమే హెచ్ఐసీసీ లోపలికి అనుమతిస్తున్నారు. హైటెక్స్ లోపలికి వచ్చే ప్రతి ఒక్క వాహనాన్నీ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పాస్‌లేని పోలీస్ వాహనాలను సైతం తిప్పి పంపి స్తున్నారు. హెచ్ఐసీసీ వద్ద ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్ కేంద్రాలలో కరోనా పరీక్షలు నిర్వహించాకే లోపలికి అను మతి ఇస్తున్నారు. ఈ నెల 4వ తేదీ వరకు సైబరాబాద్ కమి షనరేట్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఐదుగురి కంటే ఎక్కువమంది గుమిగూడితే అరెస్టు చేస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. శుక్రవా రం పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్లిన హైదరా బాద్ కొత్వాల్ సీవీ ఆనంద్ అధికారులతో బందోబస్తు, భద్రత ఏర్పాట్లు సమీక్షించారు. మరోపక్క బేగంపేట విమానాశ్రయం నుం చి పరేడ్ గ్రౌండ్స్‌కు, అక్కడ నుంచి రాజ్‌భవన్ వరకు సెక్యూరిటీ, కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. గ్రౌండ్స్ ను శనివారం ఎస్పీజీ అ«ధీనంలోకి తీసుకోనుంది. శుక్రవా రం నుంచే బేగంపేట విమానాశ్రయం, పరేడ్ గ్రౌండ్స్, బాంబు నిర్వీర్యబృందాలతో తనిఖీ చేస్తున్నారు. ముందస్తు అరెస్టులు.. ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మొదలైన నిరసనలు విధ్వంసానికి దారితీయడం, ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వటంతో ప్రధాని పర్యటన నేపథ్యంలో అకస్మాత్తుగా ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎమ్మార్పీఎస్ శనివారం సడక్‌బంద్‌కు పిలుపు ఇవ్వటంతో అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా సైబరాబాద్ పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. నేరచరితులు, రౌడీషీటర్లకు బైండోవర్లు విధిం చా రు. శంషాబాద్ మున్సిపాలిటి పరిధిలో ఎమ్మార్పీఎస్ పార్టీ కన్వీనర్ రాచమల్ల రాజును పోలీసులు అరెస్టు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు.. హెచ్ఐసీసీ, నోవాటెల్ హోటల్ పరిసర ప్రాంతాలలో శని, ఆదివారాల్లో పలు మార్గాలలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. జేఎన్టీయూ నుంచి సైబర్ టవర్స్, మియాపూర్ నుంచి కొత్తగూడ, కావూరి హిల్స్ నుంచి కొత్తగూడ, బయోడైవర్సిటీ నుంచి జేఎన్టీయూ, నారాయణమ్మ కాలేజ్ నుంచి గచ్చిబౌలి మార్గాలలో భారీ వాహనాలకు ప్రవేశం లేదు. ట్రాఫిక్ మళ్లింపు మార్గాలివే.. ►నీరూస్ జంక్షన్ నుంచి కొత్తగూడ జంక్షన్, గచ్చిబౌలి వైపు వచ్చే వాహనాలను దుర్గం చెరువు – ఇనార్బిట్ – ఐటీసీ కోహినూర్ – ఐకియా – బయోడైవర్సిటీ – గచ్చి బౌలి మీదుగా సీవోడీ జంక్షన్‌కు మళ్లిస్తారు. సైబర్ టవర్స్, హైటెక్స్ జంక్షన్ల మీదుగా ప్రవేశం లేదు. ►మియాపూర్, కొత్తగూడ, హఫీజ్‌పేట మీదుగా హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, జూబ్లీహిల్స్ వైపు వచ్చే వాహనాలు రోలింగ్ హిల్స్ – ఏఐజీ హాస్పిటల్ – ఐకియా – ఇన్నార్బిట్ – దుర్గం చెరువు రోడ్ మీదుగా వెళ్లాలి. ►ఆర్సీపురం, చందానగర్ మీదుగా మాదాపూర్, గచ్చిబౌలి వైపునకు వచ్చే వాహనాలు బీహెచ్ఈఎల్ – నల్లగండ్ల – హెచ్‌సీయూ – ఐఐఐటీ – గచ్చిబౌలి రోడ్డు మీదుగా వెళ్లాలి. అల్విన్, కొండాపూర్ రోడ్లో వాహనాలకు ప్రవేశం లేదు. -
బీజేపీ జాతీయ సభ.. షెఫ్‌లకు యాదమ్మ ‘వంటల’ పాఠాలు!
సాక్షి, హైదరాబాద్: ఫైవ్ స్టార్ హోటల్ ప్రధాన షెఫ్‌లు, వారి సహాయకులు తెలంగాణ వంటకాల పాఠాలు నేర్చుకున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆదివారం ప్రత్యేకంగా తెలంగాణ వంటకాలను వడ్డించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఫుడ్ కమిటీ ఇన్చార్జీ, మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి, ఇతర నేతలు బుధవారం వంట ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా యాదమ్మ చేయబోయే వంటకాల జాబితాను సిద్ధం చేశారు. ఆయా వంటకాలు, కావాల్సిన సామగ్రి గురించి నోవాటెల్–హెచ్ఐసీసీ షెఫ్‌లు కరీంనగర్‌కు చెందిన తెలంగాణ వంటల నిపుణురాలు యాదమ్మ నుంచి వివరాలు తెలుసుకున్నారు. సభ కోసం సర్వపిండి, ముద్ద పప్పు, పచ్చి పులుసు, గంగవాయిలి పప్పు, భక్ష్యాలు, పల్ల పులుసు, మక్క గారెలు, ఉల్లి పకోడి, పంట గారెలు, బెల్లం పరమాన్నం, సేమియా పాయసంతోపాటు మరికొన్ని రకాల వంటలను సిద్ధం చేయనున్నారు. -
నోవాటెల్‌లోనే మోదీ బస!
సాక్షి, హైదరాబాద్/రసూల్‌పురా: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరవుతున్న ప్రధాని మోదీ.. మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్లో బస చేయనున్నట్టు సమాచారం. ప్రధాని రాకకు ముందుగా బుధవారమే హైదరాబాద్‌కు చేరుకున్న ‘స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)’బృందాలు.. నోవాటెల్ హోటల్లో స్థానిక పోలీసులతో సమావేశమయ్యారు. ప్రధానితోపాటు పెద్ద సంఖ్యలో కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. మోదీ రాజ్‌భవన్‌లోనే బస చేస్తారని తొలుత భావించారు. కానీ రాజ్‌భవన్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న హెచ్ఐసీసీ వరకు ప్రధాని రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు సమస్యగా మారుతాయని నిఘా వర్గాలు పేర్కొనడంతో.. నోవాటెల్‌లోనే ప్రధాని బసను ఖరారు చేసినట్టు తెలిసింది. 2004లో హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశానికి వచ్చిన అప్పటి ప్రధాని వాజ్‌పేయి.. లోయర్ ట్యాంక్‌బండ్ ప్రాంతం లోని ఓ స్టార్ హోటల్లో బస చేశారు. మూడు రోజులు.. హోటల్ మొత్తం.. ప్రధాని మోదీ జూలై 2న సాయంత్రం ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నేరుగా సమావేశం జరిగే హెచ్ఐసీసీ ప్రాంగణానికి వస్తారు. సమావేశం తర్వాత పక్కనే ఉన్న నోవాటెల్ హోటల్లో బసచేస్తారు. మొత్తం 288 గదులున్న ఈ హోటల్లో ప్రధాని బస కోసం ఓ ఫ్లోర్ మొత్తం రిజర్వు చేసినట్టు తెలిసింది. బీజేపీ కార్యవర్గ సమావేశాల కోసం 1వ తేదీ నుంచి 3వ తేదీ దాకా ఈ హోటల్ మొత్తాన్ని బుక్ చేశారని హోటల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అణువణువూ తనిఖీలు.. భద్రత కట్టుదిట్టం ప్రధాని, కేంద్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో హెచ్ఐసీసీ, నోవాటెల్ హోటల్ పరిసర ప్రాంతాల్లో అణువణువూ తనిఖీ చేస్తున్నారు. హోటల్లో పనిచేసే సిబ్బంది, కుటుంబ సభ్యుల వివరాలను ఎస్పీజీ బృందాలు సేకరించాయని.. వారి ఇళ్లకు కూడా వెళ్లి తనిఖీ చేశాయని సమాచారం. హెచ్ఐసీసీ, నోవాటెల్ హోటల్, పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాల పనితీరును అధికారులు పర్యవేక్షించారు. సుమారు వెయ్యి మందికి పైగా పోలీసులు హోటల్ చుట్టూ పహారా కాయనున్నారు. బుధవారం నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు హెచ్ఐసీసీ చుట్టూ ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో డ్రోన్లు, పారా గ్లైడర్లు, మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను నిషేధిస్తున్నట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. సభ ఏర్పాట్లను పరిశీలించిన తరుణ్ ఛుగ్ వచ్చే నెల 3న ప్రధాని మోదీ బహిరంగ సభ జరగనున్న పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లను బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ బుధవారం పరిశీలించారు. భద్రతాపరమైన అంశాలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోదీ సభ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని.. ప్రజలు కేసీఆర్‌కు వీడ్కోలు పలికేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తరుణ్ చుగ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు కె.లక్ష్మణ్, డీకే అరుణ, గరికపాటి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. కాగా.. కార్యవర్గ సమావేశానికి వచ్చే ప్రధాని, కేంద్ర మంత్రులు, సీఎంలు, ఇతర ముఖ్య నేతలను స్వాగతించేందుకు బేగంపేట విమానాశ్రయంలో బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం తరుణ్ చుగ్‌తోపాటు బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్, ఇతర నేతలు ఏర్పాట్లను పరిశీలించారు. -
స్టైలిష్ వాక్, లవ్లీ జంపింగ్స్... స్విమ్మింగ్‌తో డాగ్స్ సందడి
-
పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది: మేకపాటి
సాక్షి, విశాఖపట్నం: పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే వాతావరణం విశాఖలో ఉందని, ఇక్కడ చక్కటి వనరులు ఉన్నాయని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖలోని నోవాటెల్ హోటల్లో యునైటేడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(యుఎన్‌ఐడీఓ), డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ)తో మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో మంత్రితో పాటు పరిశ్రమల, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరుకుంటున్నారని, అందుకే అభివృద్ధిని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేవారికి కేవలం 48 గంటల్లో అన్ని అనుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామన్నారు. పారిశ్రామికాభివృద్ధి ప్రణాళిక, ప్రచార ఆవశ్యకత, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల నవీకరణ, పర్యావరణ వ్యవస్థ, వాణిజ్య తదితర అంశాలపై నేడు ఈ సదస్సులో చర్చించనున్నట్లు మంత్రి తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇక రేపు(బుధవారం) విశాఖలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పర్యటించనున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటు నియోజకవర్గాల వారిగా నైపుణ్య శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యాలయాలు, విశ్వవిద్యాలయాల్లో పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేసే విద్యా విధానంతో ముందుకు వెళ్తున్నామన్నారు. పారదర్శకత పాలన రాష్ట్రంలో ఉందని, వైఎస్సార్ నవోదయ పథకంతో వందలాది సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. 2024నాటికి పారిశ్రామిక అభివృద్ధి సూచిలో రాష్ట్రం ముందుంటుందన్నారు. ఆహార ఉత్పత్తులు వాణిజ్యం పెంచడంతో పాటు వ్యవసాయ రంగ అభివృద్ధికి బాటలు వేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే విశాఖ ప్రపంచ స్థాయి మహానగరంగా అవతరిస్తుందని తాను నమ్ముతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. -
పబ్‌లో వీరంగం; పరారీలో ఆశిష్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: నొవాటెల్‌లోని ఆర్టిస్ట్రీ పబ్‌లో యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి దాడికి యత్నించిన ఘటనలో ఇద్దరు నిందితులను బుధవారం అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ నెల 1న పటాన్చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్, అతని స్నేహితులు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడమేగాక మద్యం బాటిళ్లతో దాడికి యత్నించారని బిగ్‌బాస్–2 కంటెస్టెంట్ అన్నె సంజన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అశిష్ గౌడ్ స్నేహితులు ముత్తంగికి చెందిన గౌండ్ల శ్రీకాంత్ అలియాస్ బిన్ను, ఇస్నాపూర్‌కు చెందిన పూసాని పవన్ కుమార్ గౌడ్‌ను బుధవారం అరెస్ట్ చేశామన్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు అశిష్ గౌడ్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు. కాగా బాధితురాలు సంజన బుధ వారం సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి నిందితులను అరెస్ట్ చేసి న్యాయం చేయాలని కోరారు. ఆర్టిస్ట్రీ పబ్‌లోని సీసీ పుటేజీని చూపించాలని కోరినా పోలీసులు స్పందించడం లేదని, తాను గుర్తించకుండా నిందితులను ఎలా అరెస్ట్ చేశారని ఆమె పేర్కొన్నారు. ఒకపక్క దిశ హత్యోందంతో మహిళల భద్రతపై ఆందోళన జరుగుతుండగా పోలీసులు ఈ కేసులో తాత్సారం చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. రాజకీయ నాయకుడి కుమారుడు కావడం వల్లే అశిష్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం లేదన్న వాదనలు విన్పిస్తున్నాయి. అశిష్ గౌడ్‌ను వెంటనే అరెస్ట్ చేసి తమకు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు. కాగా, భారతీయ యువ మోర్చా నుంచి ఆశిష్‌ను బీజేపీ ఇప్పటికే తొలగించింది. మహిళల భద్రతకు, సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఉందని.. స్త్రీలపై ఎటువంటి దాడులు చేసినా సహించబోమని సంగారెడ్డి బీజేపీ అధ్యక్షుడు ఎం నరేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. సంబంధిత వార్తలు పబ్‌లో మాజీ ఎమ్మెల్యే కుమారుడి వీరంగం మరోసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సంజన ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు: ఆశీష్ గౌడ్ -
నన్నే గుర్తు పట్టలేదా అంటూ వీరంగం..
సాక్షి, హైదరాబాద్ : పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ మాదాపూర్‌లోని నోవాటెల్‌లో గల ఆరిస్ట్రీ పబ్‌లోయువతులపై వీరంగం సృష్టించాడు. దీంతో బాధితురాలు బిగ్ బాస్ –2 కంటెస్టెంట్ అన్నె సంజన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. బిగ్ బాస్–2 కాంటెస్టెంట్ అన్నె సంజన స్నేహితులు వి.శివాణి, వి.సంజన , రమేష్‌లతో కలిసి ఆదివారం తెల్లవారు జామున 2 గంటలకు నొవాటెల్‌లోని ఆర్టిస్ట్రీ పబ్‌కు వెళ్లింది. మొదటి అంతస్తులోని టేబుల్ వద్ద ఉండగా కింది ఫ్లోర్లో ఉన్న అశిష్ గౌడ్ 2.45 గంటలకు 8 మంది స్నేహితులు కలిసి పైకి వచ్చారు. మద్యం మత్తులో ఉన్న అశిష్ గౌడ్ నన్ను గుర్తు పట్టావా అని అడగ్గా లేదని సమాధానమిచ్చింది. దీంతో రెచ్చిపోయిన అతను ఇగో ఎక్కువ .. ఎందుకు గుర్తు పడతావంటూ చెప్పలేని రీతిలో దూషణలకు దిగాడు. అంతటితో ఆగక ఖాళీ మద్యం బాటిళ్లను విసిరాడు. వి.సంజన అనే యువతి తృటిలో తప్పించుకుంది. సంజన చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. స్నేహితుడు రమేష్ అడ్డుకోవడంతో వెనక్కు తగ్గారు. అక్కడే ఉన్న బౌన్సర్ అజార్ పట్టించుకోకపోవడంతో అశీష్ మరింత రెచ్చిపోయాడు. 3 గంటల సమయంలో పోలీస్ కంట్రోల్ రూ మ్కు ఫోన్ చేయడంతో 15 నిమిషాల వ్యవధిలో మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బౌన్సర్లు యువతులను వెనక ద్వారం వద్ద ఉంచి అశిష్ గౌడ్ అతని స్నేహితులను ప్రధాన ద్వారం నుంచి బయటకు పంపారు. సంజనతో పాటు మరో మగ్గురు స్నేహితులు కలిసి తెల్లవారు జామున 4.30 గంటలకు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులపై ఐపీసీ 354, 354ఏ, 309 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాటిళ్లు విసిరి, తోసేశాడు... గుర్తు పట్టలేదన్నందుకు మాటల్లో చెప్పలేని బూతులు తిట్టాడని బాధితురాలు అన్నె సంజన ‘సాక్షి’కి తెలిపారు. బూతులు తిడుతూ చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడన్నారు. తోసివేయడంతో ఓ దశలో కింది ఫ్లోర్లో పడిపోతానేమోనని భయమేసిందని, నా స్నేహితుడు అడ్డుకోవడంతో బయటపడ్డానని పేర్కొంది. ఆర్టిస్ట్రి పబ్ యాజామాన్యానికి కాల్ చేసినా పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. ఎస్ఐ శ్రీనివాస్ సీసీ పుటేజి స్పష్టంగా లేదని చెబుతున్నాడని, కేసు విత్‌డ్రా చేసుకోవాలని అశిష్ గౌడ్ చాలా మందితో ఫోన్లు చేయిస్తున్నాడని బాధితురాలు తెలిపింది. ఆ పబ్‌కు నిబంధనలు వర్తించవు... నోవాటెల్ వీకెండ్లో పబ్‌లకు రాత్రి 1 గంటలకు పోలీసుల అనుమతి ఉంటుంది. ప్రతి వీకెండ్లో తెల్లవారు జామున 3.30 గంటల వరకు నోవాటెల్‌లోని అర్టిస్ట్రీ పబ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సైబరాబాద్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఆదివారం తెల్లవారు జామున 3 గంటలకు గలాట జరిగిందంటే నిబంధనలకు విరుద్ధంగా పబ్‌ను నిర్వహిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మాదాపూర్ పోలీసులతో పాటు సైబరాబాద్ ఎస్వో టీ పోలీసులు పబ్‌లపై నిఘా ఉంచుతున్నారు. తెల్లవారుజాము వరకు ఆర్టిస్ట్రీ పబ్ నడిచినా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదనే విమర్శలు నెలకొన్నాయి. స్నేహితుడి కూతురితో అసభ్య ప్రవర్తన వాట్సాప్‌కు అశ్లీల చిత్రాలు మైనర్ బాలికకు అసభ్య మెసేజ్‌లు పంపిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కాచిగూడ ఇన్స్పెక్టర్ హాబీబుల్లా ఖాన్ తెలిపిన మేరకు.. హిమాయత్‌నగర్ రాయల్ డిమ్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న మహ్మద్ వాహిదోద్దిన్ (43) హరియంత్ మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. అక్కడ కొన్నేళ్లనుంచి మహ్మద్ వాహిదోద్దీన్ ఖాన్‌కు పంకజ్‌తో స్నేహం ఏర్పడింది. వాహిదోద్దీన్ తరచుగా ఇసామియా బజార్లో ఉంటున్న పంకజ్ ఇంటికి వచ్చి వెళ్లుతున్నాడు. దీంతో ఇంటర్మీడియట్ చదువుతున్న పంకజ్ కూతురు (17)తో వాహీదోద్దీన్ పరిచయం పెంచుకున్నాడు. ఆమె వద్ద ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్లో వాట్సప్‌లో అశ్లీల చిత్రాలను పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఎంత చెప్పినా, మందలించినా వాహిదోద్దీన్ ఖాన్‌లో ఏమాత్రం మార్పురాలేదు. శనివారం రాత్రి పంకజ్ కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. పోలీసులు వాహిదోద్దిన్ ఖాన్ ను అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. -
విజయవాడలో ‘నోవాటెల్’ ప్రారంభం
పటమట (విజయవాడ తూర్పు): అంతర్జాతీయ ప్రమాణాలతో.. అత్యున్నత సౌకర్యాలతో వరుణ్ గ్రూప్ సంస్థ విజయవాడలో నిర్మించిన నోవాటెల్ వరుణ్ హోటల్‌ను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్ ఇండియన్ అంబాసిడర్ అలగ్జాండ్రీ జిగ్లర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అమరావతి కాస్మోపాలిటిన్ సిటీగా మారేందుకు విజయవాడకు చెందిన పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువకులు కృషి చేయటం హర్షణీయమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని చెప్పారు. నూతన రాజధాని అమరావతిలో మరో నాలుగు ఫైవ్‌స్టార్ హోటళ్లు ఏర్పాటు కానున్నాయని, అకార్ సంస్థ ఈ మేరకు నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందజేస్తామని ప్రకటించారు. తర్వాత నోవాటెల్–వరుణ్–అకార్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పదానికి సీఎం చంద్రబాబు హామీగా ఉన్నారు. అనంతరం అలగ్జాండ్రీ జిగ్లర్ మాట్లాడుతూ.. భారతదేశంలో అతిథ్య రంగానికి ప్రత్యేక స్థానం ఉందని, అతిథులకు సౌకర్యం, విలాసవంతంతోపాటు భద్రత కూడా ఇక్కడ ఉండటం శుభపరిణామమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ రంగం అభివృద్ధి చెందేందుకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. వరుణ్ గ్రూప్ సంస్థల అధినేత ప్రభు కిషోర్ మాట్లాడుతూ.. తాము ఆటోమోబైల్ రంగం నుంచి అతిథ్య రంగంలోకి వచ్చినప్పటి నుంచి అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం, భీమిలి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో హోటళ్లు, కన్వెషన్ సెంటర్లు ఏర్పా టు చేసినప్పటికీ తనకు వెలితి ఉండేదని, సొంత నగరంలో స్టార్ హోటల్ నిర్మించటంతో ఆలోటు తీరిందన్నారు. నోవాటెల్ విజయవాడ వరుణ్ హోటల్ పర్యావరణహిత హోటల్ అని తెలి పారు. విద్యుత్ నుంచి కార్పెట్ వరకు ప్రతిదీ పర్యావరణహితమైన సోలార్, గ్రీనరీ లాంటి కాలుష్యరహిత ప్రమాణాలు పాటిస్తున్నామని చెప్పారు. అంతకుముందు వరుణ్ గ్రూస్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్ఆర్) ద్వారా ప్రభుత్వానికి రూ.31 లక్షలు విరాళంగా ఇచ్చింది. కార్యక్రమంలో పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
నోవాటెల్‌లో కశ్మీరి ఫుడ్ ఫెస్టివల్
-
హైలైఫ్.. స్టైల్
సాక్షి, వీకెండ్ ప్రతినిధి: అత్యాధునిక, విలాస వస్తువులకు పేరొందిన హైలైఫ్ ఎక్స్పో మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్లో శుక్రవారం ప్రారంభమైంది. అహ్మదాబాద్, జైపూర్, ముంబై, పుణె, బెంగుళూర్, చెన్నై, కొచ్చి... తదితర ప్రాంతాలతో పాటు విదేశాల ఉత్పత్తులు ఇందులో కొలువుదీరాయి. ఈ ఎక్స్‌పోకు వర్ధమాన నటి జ్యోతి సేథి, పేజ్‌త్రీ ప్రముఖులు, ఫ్యాషన్ ప్రియులు హాజరయ్యారు. ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగుతుంది. -
నోవాటెల్ హోటెల్ పై పోలీసుల దాడి
శంషాబాద్: శంషాబాద్ నోవాటెల్ హోటల్‌పై సోమవారం తెల్లవారుజామున ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటల్లో పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 95 వేల నగదుతో పాటు 10 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హోటల్లో అసాంఘీక కార్యకలాపాలు ఎక్కువవుతున్నాయనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
ఫన్టాస్టిక్ ఫ్రూట్ మిక్సింగ్...
రెండు నెలల తర్వాత రానున్న క్రిస్మస్ కోసం అప్పుడే సన్నాహాలు మొదలయ్యూరుు. నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్లో ప్రీ-క్రిస్మస్ సన్నాహాల్లో భాగంగా ఫ్రూట్ మిక్సింగ్ వేడుక ఉత్సాహభరితంగా జరిగింది. హోటల్ సిబ్బంది అతిథులు ఒక్కొక్కరినే మిక్సింగ్ టేబుల్ వద్దకు తోడ్కొని వచ్చారు. అతిథులు డ్రైఫ్రూట్స్ గుప్పిళ్లు గుప్పిళ్లుగా చేతుల్లోకి తీసుకుని, మిక్సింగ్ పాత్రలో వేశారు. దాదాపు 150 కిలోల డ్రైఫ్రూట్స్‌ను మిక్స్ చేశారు. మిక్సింగ్ పూర్తయ్యూక వాటిపై సీసాల కొద్ది వైన్ పోశారు. మిక్స్‌చేసి, వైన్‌లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ క్రిస్మస్ నాటికి కేకులు, ఫుడ్డింగ్ల తయూరీకి ఉపయోగపడేలా సిద్ధవువుతాయుని నోవాటెల్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ చెప్పారు.ప్రత్యేక ఆకర్షణగా ప్రణీత నిలిచింది. -
నోవాటెల్‌లో ఉద్యోగినిపై అత్యాచారయత్నం
హైదరాబాద్ : శంషాబాద్ నోవాటెల్ హోటల్లో దారుణం చోటుచేసుకుంది. హోటల్లోని మహిళా ఉద్యోగినిపై ముంబయికి చెందిన ముఖేష్ అత్యాచారయత్నం చేశాడు. దాంతో బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ముఖేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. హౌస్ కీపింగ్ ఉద్యోగిని తనపై అత్యాచారయత్నం జరిగిందని, హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవటంతో పోలీసుల్ని ఆశ్రయించింది. దాంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.