పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి
సాక్షి, హైదరాబాద్: రాయలసీమ నుంచి పశ్చిమ, మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్యలో ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు ప్రాంత జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది.
శనివారం రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 39.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 22.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రానున్న రెండ్రోజులు కూడా రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయని వాతావరణ శాఖ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment