ఆర్‌ఎస్‌ఎన్ అవార్డు అందుకుంటున్న కామారెడ్డి సాక్షి విలేకరి ఎస్.వేణుగోపాలచారి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: జర్నలిజం పవిత్రమైన వృత్తే కాదు.. సామాజికమైన బాధ్యత కూడా అని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సుంద రయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్‌ఎస్‌ఎన్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులు, కవులను ఆర్‌ఎస్‌ఎన్ అవార్డులతో సత్కరిం చారు. ఈ సందర్భంగా కలాలకు సలామ్ అనే సంకలనాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా హాజరైన హరీశ్ రావు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజాసమస్య లను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారని కొని యాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం రూ. 42 కోట్లు కేటాయించిందని... జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం కోసం సీఎం యోచిస్తున్నారని హరీశ్‌రావు వివరించారు. అనంతరం కామారెడ్డి సాక్షి విలేకరి ఎస్.వేణు గోపాలచారికి ద్వితీయ అవార్డుతోపాటు మరి కొందరు జర్నలిస్టులు, కవులను ఆర్‌ఎస్‌ఎన్ అవార్డులతో సత్కరించారు.
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్ ఎన్ సేవా ఫౌండేషన్ ట్రస్టీ ఆర్.సత్యనారాయణ, టీఎస్‌పీఎస్సీ సభ్యుడు కారం రవీందర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు, ఆర్‌ఎస్‌ఎన్ అవార్డు జ్యూరీ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.రామచంద్ర మూర్తి, ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి, తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి.దేవీప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment