
సాక్షి, కరీంనగర్: స్మార్ట్‌సిటీలో భాగంగా నగరమంతా ముస్తాబవుతున్నా కరీంనగర్ ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రి పరిస్థితి మారడం లేదు. ముఖద్వారానికి కార్పొరేట్ హంగులద్ది, భవనం లోపల పట్టించుకోక పోవడంతో పెచ్చులూడుతోంది. గదులు వర్షాలకు ఉరుస్తుండడంతో రోగులు, వారి బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖద్వారం అందం, భవనం లోపల పెచ్చులను చూసి, పాలకులు, అధికారుల పనితీరు అలా ఉందని చర్చించుకుంటున్నారు.