karimnagar collectorate
-
‘సాక్షి’ కథనాల ఎఫెక్ట్.. సదరం స్కాంపై ఏసీబీ కేసు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సదరం సర్టిఫికెట్ల కుంభకోణంపై ఎట్టకేలకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) స్పందించింది. ఈ వ్యవహారంలో ‘సాక్షి’ రాసిన పలు పరిశోధనాత్మక కథనాల ఆధారంగా స్పందించిన హైదరాబాద్ ఏసీబీ డైరెక్టర్ జనరల్ కార్యాలయం ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. లోతుగా ఆరా తీసేందుకు రంగంలోకి దిగిన ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న ‘దివ్యంగా దోచేస్తున్నారు’శీర్షికన తొలిసారిగా ఈ కుంభకోణాన్ని ‘సాక్షి’వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. సదరం సర్టిఫికెట్లు తీసుకున్న పలువురు అనర్హులు ప్రతినెలా దివ్యాంగ పింఛన్లు, బస్, రైలు పాసుల్లో రాయితీలు, ఏటా ఆదాయపు పన్ను రాయితీ, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందుతూ ప్రభుత్వ ఖజానాకు అంతులేని నష్టాన్ని చేకూరుస్తున్నారు. జిల్లా సివిల్ ఆసుపత్రికి నోటీసులు! రాష్ట్ర ఖజానాకు నష్టాన్ని చేకూరుస్తున్న ఈ కుంభకోణంపై ఏసీబీ అధికారులు ఇప్పటికే డీఆర్డీఏ అధికారులకు కొన్ని ప్రశ్నలతో కూడిన నోట్‌ను పంపారు. దానికి వారి నుంచి సమాధానం రాగా తాజాగా కరీంనగర్ జిల్లా సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు సైతం నోటీసులు పంపించారు. ఇక్కడనుంచి వచ్చే సమాధానాల ఆధారంగా ఏసీబీ అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏడు జిల్లాల పరిధిలో జారీ అయిన పలు అనుమానాస్పద సర్టిఫికెట్లపై ఏసీబీ అధికారులు ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టారు. అసలేం జరిగింది..? కరీంనగర్‌లోని జిల్లా సివిల్ ఆస్పత్రి– కలెక్టరేట్లో డీఆర్డీఏలోని కొందరు అధికారులు కలిసి అనర్హులకు సదరం సర్టిఫికెట్లు జారీ చేసే తతంగానికి తెరలేపారు. వీరంతా పలు మండలాల్లో ఏజెంట్లను, తమకు అనుకూలమైన వైద్యులతో ముందే మాట్లాడుకుని వారి నుంచి రూ.లక్షలు వసూలు చేసి వారు అడిగినంత వైకల్య శాతాన్ని వేసి పంపేవారు. ఇందుకోసం సదరం వ్య వహారాలు చూసే ఇద్దరు డీఆర్డీఏ ఉద్యోగుల (శ్రీనివా స్, కిశోర్)ను పెట్టుకున్నారు. వాస్తవానికి వీరిని 2019 లోనే డీఆర్డీఏ తొలగించగా..ఈ వ్యవహారంలో ఉన్న పూర్వానుభవంతో ఎలాంటి నియామక పత్రాలు లేకున్నా..26 నెలలపాటు శ్రీనివాస్, కిశోర్‌తో సివిల్ ఆసుపత్రిలో దందా చేయించారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
ముఖద్వారం ముచ్చటగొలిపి.. భవనం పెచ్చులూడి
సాక్షి, కరీంనగర్: స్మార్ట్‌సిటీలో భాగంగా నగరమంతా ముస్తాబవుతున్నా కరీంనగర్ ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రి పరిస్థితి మారడం లేదు. ముఖద్వారానికి కార్పొరేట్ హంగులద్ది, భవనం లోపల పట్టించుకోక పోవడంతో పెచ్చులూడుతోంది. గదులు వర్షాలకు ఉరుస్తుండడంతో రోగులు, వారి బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖద్వారం అందం, భవనం లోపల పెచ్చులను చూసి, పాలకులు, అధికారుల పనితీరు అలా ఉందని చర్చించుకుంటున్నారు. -
ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడినా.. సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధం అవుతోంది. ఓటర్ల నమోదు, పోలింగ్ కేంద్రాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం), ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్‌తోపాటు అధికార యంత్రాంగం బిజీబిజీగా ఉంది. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఇదేపనిలో తలమునకలవుతున్నారు. ఒకపక్క ఓటరు నమోదు ప్రక్రియ, జాబితా ప్రకటన ప్రక్రియ వేగవంతంగా చేస్తూనే.. మిగతా పనులన్నీ చక్కబెడుతున్నారు. జిల్లాకు వచ్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పరిశీలన, మాక్ పోలింగ్, రాజకీయ పార్టీలతో అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జేసీ జీవీ శ్యాంప్రసాద్ లాల్ సమక్షంలో బెంగళూర్ నుంచి వచ్చిన 20 మంది ఇంజినీర్లు వీటి పనితీరును వివరిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇదివరకు ఉన్న 13,221 బ్యాలెట్ యూనిట్లు, 8,636 కంట్రోల్ యూనిట్లను అధికారులు తిరిగి పంపించారు. ప్రస్తుతం జిల్లాలో 1,142 పోలింగ్ కేంద్రాలు ఉండగా 1,830 బ్యాలెట్ యూనిట్లు, 1,430 కంట్రోల్ యూనిట్లు బెంగళూర్‌లోని బీఎల్ కంపెనీ నుంచి తెప్పించారు. కొత్తగా 1,540 వరకు వీవీ ప్యాట్స్ ప్రవేశపెట్టారు. జేసీ శ్యాంప్రసాద్‌లాల్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తూ అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంల ప్రాథమిక పరిశీలన కార్యక్రమం వారంరోజులు సాగుతోంది. వివిధ రాజకీ య పార్టీల సమక్షంలో బీఎల్ కంపెనీకి చెందిన 20 మంది ఇంజినీర్లు ఏ విధంగా పనిచేస్తాయో ఆదివారం కూడా వివరించా రు. కీప్యాడ్లు, డిస్ప్లే బోర్డులు, లైటింగ్, సౌండ్ సిస్టం పనితీరును పరిశీలిస్తున్నారు. ఈవీఎంను పరిశీలించిన కలెక్టర్... ఎన్నికల సంఘం జిల్లాకు బెంగళూర్ నుంచి పంపించిన ఈవీఎంలను అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం పంపించిన అన్ని ఈవీ ఎంలను ముందుగా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మొదటిస్థాయి తనిఖీని చేస్తున్నట్లు తెలిపారు. తర్వాత ఈవీఎంలు అన్నిసరిగా పని చేస్తున్నది లేనిది రాజకీయ నాయకుల సమక్షంలోనే ఇంజినీర్లు తనిఖీ చేస్తారన్నారు. అనంతరం కొత్తగా ఈవీఎంలకు వీవీ ప్యాట్స్‌ల పనితీరును కూడా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో వివరిస్తామని తెలిపారు. రాజకీయ పార్టీల నేతల సమక్షంలో మాక్‌పోలింగ్: సర్పరాజ్ అహ్మద్ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల సంఘం జిల్లాకు పంపిన ఈవీఎంలతో మాక్‌పోల్ నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఆదివారం ఉదయం కలెక్టరేట్ వెనుక గల ఈవీఎంల గోదాములో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోవారు ఎంచుకున్న ఈవీఎంలతో ఓట్లు వేయించి మాక్‌పోల్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎంలతోపాటు ఈసారి కొత్తగా వీవీ ప్యాట్లను కూడా పంపించిందని తెలిపారు. వేసిన ఓటును అదే అభ్యర్థికి పడింది.. లేనిది వి.వి ప్యాట్ స్కీన్‌పై చూడవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివిధ ఈవీఎంలపై ఓట్లు వేసి ఓట్లు సరిగా పడుతున్నాయా..? లేదా..? అని రాజకీయ పార్టీల అభ్యర్థులకు చూపించారు. అదే విధంగా రాజకీయ పార్టీల అభ్యర్థులను కూడా మాక్‌పోల్‌లో పాల్గొని ఓట్లు వేసి ఈవీఎంల పనితీరును పరిశీలించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, అసిస్టెంట్ కలెక్టర్ రాజర్షిషా, జిల్లా రెవెన్యూ అధికారి భిక్షనాయక్, మెప్మా పీడీ పవన్‌కుమార్, జిల్లా కోశాధికారి కార్యాలయం ఉప సంచాలకులు శ్రీనివాస్, కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ శ్రీనివాస్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్‌ను పరిశుభ్రంగా ఉంచాలి
జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్ టవర్‌సర్కిల్: మహాత్మాగాంధీ స్ఫూర్తితో ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని..ఇదే స్ఫూర్తితో కరీంనగర్ కలెక్టరేట్‌ను పరిశుభ్రతలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని జేసీ బద్రి శ్రీనివాస్ కోరారు. ఆదివారం ఉదయం కలెక్టరేట్లో అధికారులు, సిబ్బందితో కలిసి స్వచ్ఛభారత్ నిర్వహించారు. ముందుగా కార్యాలయం ఆవరణలోని గాంధీ విగ్రహం స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జేసీ మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలు ప్రగతికి సోపానాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణమవుతుందన్నారు. ప్రతి ఒక్కరు నైతిక విలువలు పెంపొందించుకోవాలని కోరారు. కార్యాలయంలో రికార్డులు క్రమపద్ధతిలో ఉంచుకోవాలని సూచించారు. కార్యాలయాలను దేవాలయాలుగా చూడాలన్నారు. పాత ఫర్నీచర్, పాత రికార్డు తొలగించి, కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇక నుంచి ప్రతినెల మూడో శనివారం ఉదయం 7 గంటలకు స్వచ్ఛభారత్ నిర్వహిస్తామని జేసీ తెలిపారు. డీఆర్వో అయేషామస్రత్‌ఖానమ్, సీపీవో సుబ్బారావు, ఆర్డీవో రాజాగౌడ్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, డీసీవో ఇంద్రసేనారెడ్డి, కలెక్టరేట్ పాలనాధికారి దిండిగాల రవీందర్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ముట్టడించిన ఆశావర్కర్లు
కరీంనగర్: కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లాలోని ఆశా వర్కర్లు బుధవారం నాడు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ జిల్లా నలుమూలల నుంచి భారీసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కలెక్టరేట్ గేటు లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఆశావర్కర్లకు మధ్య స్వల్ప తోపులాట చేసుకుంది. సుమారు మూడు గంటల పాటు ధర్నా నిర్వహించటంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
కలెక్టరేట్ వద్ద హాస్టల్ విద్యార్థుల ఆందోళన
కరీంనగర్ : వసతి గృహంలో భోజనం సరిగా పెట్టటం లేదంటూ విద్యార్థులు శుక్రవారం ఆందోళన దిగారు. ఈ ఘటన శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద చోటు చేసుకుంది. కరీంనగర్‌లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలకు చెందిన 200 మంది విద్యార్థులు శుక్రవారం కలెక్టరేట్ వద్దకు భారీ ర్యాలీగా తరలివచ్చి ... గేటు వద్ద బైఠాయించారు. పాఠశాలకు అనుబంధంగా ఉన్న హాస్టల్లో సరైన టిఫిన్ పెట్టడం లేదని... మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదంటూ వసతి గృహం విద్యార్థులు ఆరోపించారు. ఇదేమని అడిగితే నిర్వహాకులు దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టరేట్లో అధికారులు ఎవరు లేరని... వారు వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు చెప్పారు. -
కలెక్టరేట్ వద్ద వీఆర్వోల ఆందోళన
కరీంనగర్: ఎంతోకాలం నుంచి పరిష్కారం కాని తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వీఆర్వోలు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద బుధవారం బైఠాయించారు. కనీస వేతనాలు అమలు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అదే విధంగా నాల్గోతరగతి ఉద్యోగులుగా తమను గుర్తించాలని నినదించారు. 010 పద్దు కింద జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బండెడు చాకరీ చేస్తున్న వీఆర్వోలపై తెలంగాణ సర్కార్ చిన్నచూపు చూస్తోందని వాపోయారు. ఇప్పటికైనా తమ డిమాండ్లు పరిష్కరించాలని.. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వీఆర్వోలు హెచ్చరించారు. -
కలెక్టరేట్‌కు మళ్లీ కరెంట్ కట్