ఎంతోకాలం నుంచి పరిష్కారం కాని తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వీఆర్వోలు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద బుధవారం బైఠాయించారు.
కరీంనగర్: ఎంతోకాలం నుంచి పరిష్కారం కాని తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వీఆర్వోలు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద బుధవారం బైఠాయించారు. కనీస వేతనాలు అమలు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అదే విధంగా నాల్గోతరగతి ఉద్యోగులుగా తమను గుర్తించాలని నినదించారు.
010 పద్దు కింద జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బండెడు చాకరీ చేస్తున్న వీఆర్వోలపై తెలంగాణ సర్కార్ చిన్నచూపు చూస్తోందని వాపోయారు. ఇప్పటికైనా తమ డిమాండ్లు పరిష్కరించాలని.. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వీఆర్వోలు హెచ్చరించారు.