సాక్షి, హైదరాబాద్: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికలు, రాహుల్ సభ ఎక్కడ పెట్టాలన్న అంశంపై చర్చించారు. ఈ క్రమంలో వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ పార్టీలో నేను చురుగ్గానే ఉన్నాను. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసే పనిచేస్తున్నాను. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికే టికెట్ ఇవ్వాలి.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70-80 సీట్లుతో గెలుస్తుంది. ఎన్నికల ముందే 100 శాతం అభ్యర్థులను ఖరారు చేయాలి. అన్ని సామాజిక వర్గాలవారికి టికెట్లు ఇవ్వాలి. అలాగే, రాహుల్ గాంధీ సిరిసిల్ల సభపై చర్చించామని తెలిపారు. బిజీగా ఉండటంతో పీఏసీలకు పోలేదు. ఒక్కరితో పార్టీ అధికారంలోని రాదు. పీఏసీల సంఖ్యను 12కి తగ్గిస్తామని చెప్పారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత తెలంగాణ అంతటా పర్యటిస్తాను. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అనే అంశంపై ఠాగూర్‌తో చర్చించాము’’ అని అన్నారు.
ఇది కూడా చదవండి: ఏఐసీసీ కార్యదర్శిగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment