
సాక్షి, హైదరాబాద్: వన్డేల్లో 14 వేల పరుగులు సాధించి విరాట్ కోహ్లి రికార్డు సృష్టిస్తే, 14 నెలలుగా అసెంబ్లీకి రాకుండా మాజీ సీఎం కేసీఆర్ కూడా రికార్డు సృష్టించారని దేవాదాయ, అటవీ శాఖమంత్రి కొండా సురేఖ ఎద్దేవా చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించడం హర్షణీయం.
ఈ విజయాన్ని అందరం టీవీల్లో చూసి సంబురపడ్డాం. క్రికెట్‌లో అది విరాట్ కోహ్లి పర్వం అయితే, ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం దేశ రాజకీయ చరిత్రలో పెద్ద రికార్డే కదా? ఇది కేసీఆర్ విరాట పర్వం’ అని ఆ ప్రకటనలో సురేఖ వెల్లడించారు.
ఆధార్ లేకుంటే వైద్యానికి నిరాకరిస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఆధార్ లేకుంటే వైద్యానికి నిరాకరిస్తున్నారా? అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వివరాలు తెలుసుకొని చెప్పాలని స్పెషల్ జీపీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఓయూలో ఆధార్ లేకుంటే వైద్యం చేయట్లేదంటూ న్యాయవాది బైరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణక యారా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఆకాశ్ బాగ్లేకర్ వాదిస్తూ ప్రభుత్వాస్పత్రిలో వైద్యానికి ఆధార్ తప్పనిసరి అనడం చట్టవిరుద్ధమన్నారు. ఆధార్ అడగకుండా వైద్యం అందించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కాగా, ఆధార్ లేకున్నా వైద్యం అందిస్తున్నామని స్పెషల్ జీపీ రాహుల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment