
సాక్షి, హైదరాబాద్ : పరిశ్రమల శాఖ, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, హైదరాబాద్ ఫార్మా సిటీపై సంబంధిత అధికారులతో మంగళవారం మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. భూములు పొంది కార్యకలాపాలు ప్రారంభించని వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కేటీఆర్ ఆదేశించారు. నిర్ణీత గడువులోగా కార్యకలాపాలు ప్రారంభించకుంటే, కంపెనీలకు ఇచ్చిన భూములు రద్దు చేస్తామని హెచ్చరించారు.
స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌పై జరిగిన సమీక్షా సమావేశంలో ఈ-స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యకలాపాల విస్తరణకు కేటీఆర్ పలు సూచనలు చేశారు. హైదరాబాద్ ఫార్మా సిటీ కాలుష్య రహితంగా ఉండబోతోందని కేటీఆర్ అన్నారు. (‘కార్పొరేషన్ పేరిట ప్రభుత్వం అప్పులు చేస్తోంది’)
Comments
Please login to add a commentAdd a comment