గ్రేటర్‌ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ | KTR Holds Review Meeting On Free Drinking water In Hyderabad | Sakshi
Sakshi News home page

వచ్చే నెల నుంచి ఉచిత తాగునీరు : కేటీఆర్‌

Published Sat, Dec 19 2020 2:41 PM | Last Updated on Sat, Dec 19 2020 6:59 PM

KTR Holds Review Meeting On Free Drinking water In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వచ్చే ఏడాది తొలి వారంలోనే హైదరాబాద్‌లో ఉచిత తాగునీటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు హైదరాబాద్‌ జలమండలి ద్వారా 20 వేల లీటర్ల వరకు తాగు నీటిని ఉచితంగా అందిస్తామన్నారు. ఇందుకు కావాల్సిన కార్యాచరణపైన మంత్రి కేటీఆర్‌ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, జలమండలి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నగర ప్రజలకు ఇచ్చిన మాట మేరకు డిసెంబర్‌ నెల తాగు నీటి వినియోగం 20 వేల లీటర్ల వరకు ఉచితంగా అందించాలన్నారు. ఈ మేరకు జనవరిలో వినియోగదారులకు వచ్చే డిసెంబర్ నెల బిల్లులో 20 వేల లీటర్ల వరకు ఛార్జ్ చేయొద్దని ఆదేశించారు. ఒకటి రెండు రోజుల్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలను సిద్ధం చేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement