
సాక్షి, హైదరాబాద్: విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఆదివారం లండన్ నుంచి దావోస్ బయల్దేరారు. నాలుగు రోజుల పాటు లండన్‌లోని పలు ప్రముఖ సంస్థలతో సమావేశాలు నిర్వహించిన అనంతరం కేటీఆర్ లండన్ హీత్రూ విమానాశ్రయం నుంచి జ్యూరిక్ వెళ్లారు. అక్కడ ఆయనకు టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ స్విట్జర్లాండ్ విభాగంతో పాటు వివిధ రంగాలకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు ఘనస్వాగతం పలికారు.
కేటీఆర్ జ్యూరిక్ నుంచి రోడ్డు మార్గంలో దావోస్‌కు చేరుకుంటారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో కేటీఆర్ పాల్గొంటారు. ప్రపంచం లోని వివిధ ప్రతిష్టాత్మక సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం 26న స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ నగరంలో పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు.