మెదక్: సంగారెడ్డి జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. కల్హేర్ మండలం ఖానాపూర్, కడ్పల్.. నారాయణఖేడ్ మండలంలోని తుర్కపల్లి సంజీవ రావు పేట గ్రామ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఖానాపూర్‌లో మేకల మందపై చిరుత పులి దాడి చేయడంతో మూగజీవులు తీవ్రంగా గాయపడ్డాయి. చిరుతపులి సంచారంతో స్థానికులతో పాటు గొర్ల కాపరులు భయంతో వణికిపోతున్నారు. అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకొని తమను కాపాడాలని కోరుతున్నారు.
వారం రోజులుగా చిరుత వ్యవసాయ పంట పొలాల వైపు వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు బోన్లు ఏర్పాటు చేసి బంధించాలని కోరుతున్నారు. నారాయణ ఖేడ్ నియోజకవర్గం మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉందని.. ఇరు రాష్ట్ర ఫారెస్ట్ అధికారులు పట్టుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment