![Leopard Found Dead On Road Near Manyamkonda - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/8/Leopard_0.jpg.webp?itok=dZDOXmNt)
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలోని మన్నెంకొండ సమీపంలో కాకతీయ స్కూల్ వద్ద రోడ్డుపై చిరుత పులి మృత్యువాత పడింది. రోడ్డుపై చనిపోయి పడిఉన్న చిరుతను స్దానికులు గుర్తించారు. అయితే చిరుత రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడం వల్ల మృతి చెంది ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.
సమాచారం తెలియటంతో ఫారెస్టు అధికారులు ఘటన స్ధలాన్ని పరిశీలించారు. చిరుత వయస్సు రెండేళ్లు ఉంటుందని చెబుతున్నారు .కాగా 12 ఏళ్ల క్రితం ఇలాగే ఓ చిరుత చనిపోయిందని స్దానికులు చెబుతున్నారు. 167 జాతీయ రహదారికి ఇరువైపుల మన్నెంకొండ, చౌదర్ పల్లి గుట్టలు ఉండటంతో తరచు చిరుతలు రోడ్డు దాటుతుంటాయని అంటున్నారు. చిరుత మృతిపై అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు
Comments
Please login to add a commentAdd a comment