Leopard killed
-
మహబూబ్‌నగర్: గుర్తు తెలియని వాహనం ఢీ.. చిరుత మృతి
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలోని మన్నెంకొండ సమీపంలో కాకతీయ స్కూల్ వద్ద రోడ్డుపై చిరుత పులి మృత్యువాత పడింది. రోడ్డుపై చనిపోయి పడిఉన్న చిరుతను స్దానికులు గుర్తించారు. అయితే చిరుత రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడం వల్ల మృతి చెంది ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం తెలియటంతో ఫారెస్టు అధికారులు ఘటన స్ధలాన్ని పరిశీలించారు. చిరుత వయస్సు రెండేళ్లు ఉంటుందని చెబుతున్నారు .కాగా 12 ఏళ్ల క్రితం ఇలాగే ఓ చిరుత చనిపోయిందని స్దానికులు చెబుతున్నారు. 167 జాతీయ రహదారికి ఇరువైపుల మన్నెంకొండ, చౌదర్ పల్లి గుట్టలు ఉండటంతో తరచు చిరుతలు రోడ్డు దాటుతుంటాయని అంటున్నారు. చిరుత మృతిపై అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు -
అయ్యో తల్లి.. ఆ చిరుత పులి నీపై కనికరం చూపలేకపోయిందా
జమ్ము-కాశ్మీర్ : ఇంటి చుట్టూ ఆహ్లాదకర వాతావారణం. ఆడుకునేందుకు అనువైన ప్రాంతం. ఓ చిన్నారి ఇంటి లాన్లో ఆటలాడుకుంటూ అనంతలోకాల్లో కలిసి పోయింది. అప్పటి వరకు ఆడుకుంటూఉన్న చిన్నారి విగతజీవిగా కనిపించడంతో స్థానికుల గుండె తరుక్కుపోయింది జమ్మూ-కాశ్మీర్‌లోని బూద్గాం జిల్లా ఓంపోరా హౌసింగ్ కాలనీలో నాలుగేళ్ల చిన్నారి అధా యాసిర్ ఇంటి పరిసరాల్లో ఆడుకుంటుంది. అయితే లాన్లో ఆడుకుంటున్న ఆధా ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడ్చింది. పాప ఏడుపు విన్న కుటుంబసభ్యులు ఏమైందోనని కంగారు పడ్తూ వచ్చి చూడాగా పాప కనిపించలేదు. దీంతో పాప కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఇల్లు, కాలనీ పరిసరాల్ని పరిశీలించారు. స్థానికులు మాత్రం అప్పటి వరకు చిన్నారి ఆధా ఆడుకుంటుండగా తాము గమనించినట్లు చెప్పారు. అయితే పాప ఆచూకీ ఎంతకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంటి సమీపంలో చెప్పులు, మెడలోని హారం లభ్యమయ్యాయి. కానీ పాప ఎక్కడుందో తెలియదు. కానీ గాలింపు చర్యల్లో మరుసటి రోజు ఇంటి నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో చిన్నారి మృతదేహం లభ్యమైనట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. పాపను చిరుత పులి చంపి ఉంటుందని జిల్లా సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ తాహిర్ సలీమ్ తెలిపారు. చిన్నారి మరణంపై స్థానికులు, పలువురు రాజకీయ నేతలు అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అటవీ ప్రాంతం. వన్యప్రాణాలు తిరుగుతుంటాయి. అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. చైన్ ఫెన్సింగ్ నిర్మాణంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఉండి ఉంటే పాప ప్రాణాలు దక్కేవని మండిపడుతున్నారు. చదవండి : నేను రాజుని.. ఇంటి బయటకు పిలిచి ఆగి ఉన్న కార్ల మధ్యలో దారుణం -
దారుణం: యువకుడిని చంపి భక్షించి..
తుమకూరు(కర్ణాటక): రాష్ట్రంలో గురువారంనాడు చిరుతపులులు విరుచుకుపడ్డాయి. తుమకూరు, కొప్పళ జిల్లాల్లో చిరుతల దాడుల్లో ఒక మహిళ, యువకుడు ప్రాణాలు కోల్పోయారు. తమకూరు జిల్లా గుబ్బి తాలూకా సీఎస్ పుర హోబళి మణికుప్ప గ్రామంలో 48 ఏళ్ల భాగ్యమ్మ అనే మహిళ చిరుత చేతిలో మృత్యువాత పడింది. ఆమె ఉదయం పశువులను సొంత పొలానికి తోలుకెళ్లింది. ఈ సమయంలో ఎక్కడి నుంచో ఒక చిరుత మీద పడి గొంతు కొరికేసింది. పక్క పొలాల్లోనివారు గట్టిగా కేకలు వేస్తూ రావడంతో చిరుత పరారైంది. అప్పటికే ఆమె కన్నుమూసింది. ఈ ప్రాంతంలో పలుమార్లు చిరుత దాడులు జరుగుతున్నా అటవీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. నిద్రిస్తున్న యువకున్ని చంపి భక్షణ గంగావతి: తాలూకాలోని ఆనెగుంది సమీపంలో మేగోటె దుర్గాదేవి ఆలయ గోశాల వద్ద నిద్రిస్తున్న ఓ యువకునిపై చిరుతపులి దాడి చేసి హతమార్చిన ఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. దేవస్థానంలో వంట పని, గోశాల పశువులను చూసుకునే హులిగప్ప(23) అనే యువకుడు గోశాల వద్ద నిద్రిస్తుండగా చిరుత దాడి చేసింది. అతన్ని నోట కరుచుకుని గుహలోకి తీసుకెళ్లి చంపి గొంతు, కుడి కాలు తొడను తినేసింది. ఇటీవల చిరుత బెడద ఎక్కువై నెల రోజుల్లోనే ఇద్దరు మహిళలతో పాటు ఇదే దేవస్థానం వద్ద హైదరాబాద్‌కు చెందిన బాలుడిపై చిరుత దాడి చేసిన ఘటనలు జరిగాయి. కొప్పళ ఎంపీ కరడి సంగణ్ణ ఘటనాస్థలాన్ని పరిశీలించి రూ.7 లక్షల పరిహారం ఇప్పిస్తామని కుటుబ సభ్యులకు హామీ ఇచ్చారు. -
ఉచ్చుకు చిరుత బలి
సాక్షి, బజార్హత్నూర్(ఆదిలాబాద్) : అడవి పందుల కోసం పంట చేను చుట్టూ అమర్చిన విద్యుత్ కంచెకు తగిలి ఓ చిరుతపులి బలైంది. బజార్హత్నూర్ మండలంలోని డేడ్రా అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉమర్డ(బి) గ్రామ సమీపంలో మంగళవా రం రాత్రి చౌహన్ నాందేవ్ తన చేనులో అ డవి పందుల కోసం విద్యుత్ తీగలు అమర్చగా అటువైపు వచ్చిన చిరుతపులి విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. మండలంలోని డేడ్ర అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చులో చిరుతపులి మృతి చెందిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఇచ్చోడ అటవీ శాఖ ఎఫ్‌డీవో బర్నోబా, ఎఫ్ఆర్వో అప్పయ్య తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని డేడ్ర అటవీ బీట్‌లోని ఉమర్డ(బి) గ్రామానికి 50మీటర్ల దూరంలోని తన చేనులో చౌహన్ నాందేవ్ తన కుటుంబంతో కలసి నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి తన చేనులో అడవి పందుల వేట కోసం సింగిల్ ఫేజ్ విద్యుత్ తీగలను అమర్చారు. రాత్రి ఆ వైపుగా వచ్చిన చిరుతపులి విద్యుత్ తీగలు తగిలి షాక్‌తో మృతి చెందింది. ఉదయం మృతి చెందిన చిరుతపులిని చూసిన నాందేవ్ మరో ఆరుగురు చౌహన్ కృష్ణ, సిడం నాగోరావ్, కొడప కృష్ణ, పెందూర్ నాగేందర్, సోయం నాగేశ్వర్, మడవి సునిల్ సహకారంతో కళేబారాన్ని సంఘటన స్థలం నుంచి 100 మీటర్ల దూరంలోని పొదల్లోకి తీసుకెళ్ళి కాల్చివేశారు. చౌహన్ నాందేవ్ తాగిన మైకంలో బజార్హత్నూర్ గ్రామానికి వచ్చి ఫోన్లో అటవీశాఖ ఎఫ్ఆర్వో అప్పయ్యకు ఉమర్డ గ్రామస్తులు చిరుతపులిని చంపారని, దానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపాడు. దీంతో ఎఫ్ఎస్వో సుదర్శన్ సిబ్బందితో బజార్హత్నూర్ గ్రామానికి చేరుకుని నాందేవ్‌ను అదుపులో తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి కాలిన బూడిదను, నాందేవ్ ఇంటివద్ద నుంచి చిరుతపులికి సంబంధించిన 9గోర్లు, 7మీసాలను స్వాదీనం చేసుకున్నారు. నిందితులపై వైల్డ్‌లైప్ యాక్ట్ 1972 ప్రకారం సెక్షన్ 9, 39(1)(డీ), 44ఆర్/డబ్ల్యూ 51, ఫారెస్ట్ యాక్ట్ 1967 ప్రకారం యూ/ఎస్ 20(1)(సీ), యూ/ఎస్ 3, యూ/ఎస్ 447, 429, 120(బి), ఆర్/డబ్ల్యూ 34ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఐదుగురిని అరెస్ట్ చేశామని చౌహన్ కృష్ణ, కొడప కిషన్‌లు ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. ఇన్‌ఫార్మరే ప్రధాన నిందితుడు డేడ్ర అటవీ ప్రాంతంలో మంగళవారం చోటు చేసుకున్న చిరుతుపులి మృతి సంఘటనలో ప్రధాన నిందితుడు చౌహన్ నాందేవ్ అటవీ శాఖ అధికారులకు చాలా రోజులుగా ఇన్ఫార్మర్గా పని చేస్తున్నాడు. ఉమర్ఢ గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం అటవీ శాఖ అధికారులతో నాందేవ్‌కు ఉన్న సన్నిహిత్యంతో మాంసం కోసం అటవీ జంతువులను వేటాడుతూ ఉంటాడని, మంగళవారం నాందేవ్ అటవీ పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలకు చిరుతపులి బలి అయిందని తెలిపారు. అనంతరం తాగిన మైకంలో అధికారులకు విషయం చెప్పాడని వివరించాడు. అక్రమ కేసులు పెట్టారని గ్రామస్తుల ఆందోళన లంబాడా కులానికి చెందిన చౌహన్ నాందేవ్ తన కుమారుడు చౌహన్ కృష్ణ ఇద్దరు చిరుతపులి మృతికి కారకులని గ్రామానికి చెందిన సిడం కాశీరాం తెలిపారు. ఆయన మాట్లాడుతూ నాందేవ్ ఉదయం గ్రామానికి వచ్చి చిరుతపులి మృతిచెందిందని అటవీ శాఖ అధికారులకు తెలిస్తే జైలుకు పంపుతారని, నన్ను కాపాడలని వేడుకుంటే గ్రామస్తులు వెళ్ళారే తప్ప అందులో ఆదివాసీలు ఎవరు బాధ్యులు కారని ఇచ్చోడ రేంజ్ కార్యాలయం ఆవరణలో ఆందోళనకు దిగారు. సిడం కిషన్ ఢిల్లీలో ఆదివాసీ గర్జన సభలో ఉంటే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని తెలిపారు. మంగళవారం రాత్రి విచారణ పేరుతో ఎఫ్ఆర్వో అప్పయ్య ఉమార్డ గ్రామంలో ఆదివాసీ మహిళను తలుపులు పెట్టి విచారించడం ఏమిటని ప్రశ్నించారు. ఆదివాసీలు వందల సంఖ్యలో రేంజ్ కార్యాలయానికి చేరుకోవడంతో బోథ్, ఇచ్చోడ సీఐలు మల్లేష్, శ్రీనివాస్, ఎస్సైలు పుల్లయ్య, ఫరిద్, భరత్‌సుమన్, పోలీసు సిబ్బంది చేరుకొని ఆదివాసీ గిరిజనులను మెప్పించి అక్కడి నుంచి పంపించారు. -
చిరుత.. మృత్యువాత
మంచిర్యాలఅర్బన్: వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు చిరుతపులి బలైంది. ఈ ఘటన సోమవారం మంచిర్యాలలో ఆలస్యంగా వెలుగు చూసింది. మంచిర్యాల ఫారెస్ట్ డివిజన్ అధికారి వెంకటేశ్వరావు కథనం ప్రకారం... లక్సెట్టిపేట అటవీ రేంజ్ పరిధిలోని పాత మంచిర్యాల బీట్ రంగంపేట్ అటవీ సమీపంలో వన్యప్రాణుల కోసం వేటగాళ్లు ఓ చెట్టుకొమ్మకు క్లచ్ వైరుతో ఉచ్చు బిగించారు. ఓ చిరుతపులి అటుగా వచ్చి ఈ ఉచ్చులో చిక్కుకుంది. తప్పించుకునే ప్రయత్నం చేసినా అది మెడకు మరింతగా బిగుసుకుపోవటంతో మృత్యువాత పడింది. సోమవారం అటవీ ప్రాంతంలోకి వంటచెరుకు కోసం వెళ్లిన స్థానికులు ఉచ్చులో పడి ఉన్న చిరుతను గమనించారు. సమాచారం అందుకు న్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. 3 రోజుల కిందట చిరుత మృతి చెందినట్లు భావిస్తున్నారు. నిందితులను పట్టుకుంటామని మంచిర్యాల ఎఫ్‌డీవో వెంకటేశ్వరావు తెలిపారు. అనుమానాస్పదస్థితిలో చిరుత మృతి మాక్లూర్: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మామిడిపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చిరుతపులి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఈ మేరకు నలుగురు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 4న గుత్ప శివారులోని ఓ మామిడితోటకు వేసిన ఇనుప కంచె కు చిక్కిన చిరుత అదేరోజు సాయంత్రం తప్పించుకుంది. ఈ నేపథ్యంలో అటవీప్రాంతంలో పూర్తిగా కుళ్లిపోయిన చిరుత కళేబరం కనిపించింది. అటవీ అధికారులు డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి విచారణ చేపట్టారు. చిరుతపులి చనిపోయిన స్థలంలో కొద్ది దూరంలోనే దాని తల, నడుము, మరి కొద్ది దూరంలో కాలు పడి ఉన్నాయి. చిరుత కళేబరం పూర్తిగా కుళ్లిపోయింది. పక్కనే బీడీల కట్ట, అంబర్ ప్యాకెట్ లభించాయి. డాగ్‌స్క్వాడ్ ఆధారంగా గుత్ప తండాకు చెందిన రవికుమార్, తులసీరాం, నరేందర్, విజయ్‌లను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి నుంచి పులికి సంబంధించిన 7 గోర్లు, 4 దంతాలను స్వాధీనం చేసుకున్నారు. చిరుత అనారోగ్యంతో మృతి చెందిందా.. లేదా వేటగాళ్లు చంపేశారా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చిరుత కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ల్యాబ్‌కు పంపారు. -
గార్లదిన్నెలో వాహనం ఢీకొని చిరుత మృతి
-
స్వార్థం వల.. వన్యప్రాణి విలవిల
అడవి అంటే.. పచ్చని చెట్లు.. గలగల పారే సెలయేళ్లు.. పక్షుల కిలకిల రావాలు.. వన్యప్రాణుల సవళ్ల గుర్తుకు వస్తాయన్నది నాటి మాట. కనుమరుగైన చినుకు జాడ.. ఎండిన నీటివనరులు.. ఆగని వేట.. విద్యుదాఘాతాలు.. ప్రమాదాలతో వన్యప్రాణుల ఉనికికి ముప్పు వాటిల్లుతోంది. అడవి జంతువుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలు అమలుకు నోచుకోకపోవడంతో జీవవైవిధ్యానికి ఎసరొస్తోంది. పలమనేరు: జిల్లాలోని అడవుల్లో వన్యప్రాణులకు రక్షణ కరువైంది. రకరకాల కారణాలతో ఎప్పుడు దేని ప్రాణం పోతుందో తెలియదు. అరుదైన చిరుత పులులు సైతం ఇటీవల కాలంలో వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్నాయి. ఇక మృత్యువాత పడుతున్న ఏనుగుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. వన్యప్రాణులు, మృగాలకు సంబంధించి పటిష్టమైన చట్టాలున్నా అవి అమలుకు నోచుకోవడం లేదు. దీంతో వన్యప్రాణి మనుగడ ప్రశ్నార్థకమైంది. జిల్లాలోని అడవుల్లో అమర్చిన ఉచ్చులు, నల్లమందు ఉండలు, నాటు తుపాకులతో ఆటోమేటిక్ ఫైరింగ్, అడవిని ఆనుకుని ఉన్న పొలాల్లో కరెంటు తీగలకు బలవుతూనే ఉన్నాయి. వన్య ప్రాణాలకు తప్పని ముప్పు కొన్నాళ్లుగా వన్యప్రాణుల వేట నిరాటంకంగా సాగుతోంది. కొందరు నిత్యం అడవిలో వేటే జీవనోపాధిగా మార్చుకున్నారు. దీంతో అడవుల్లో నాటు తుపాకుల మోత తగ్గడం లేదు. ఉరులు, నాటు బాంబులతో సైతం వన్యప్రాణుల వేట కొనసాగుతోంది. అలాగే అటవీ శివారు ప్రాంతాల్లోని రైతులు అడవి జంతువుల బారి నుంచి తమ పంటలను కాపాడుకోవడానికి విద్యుత్ తీగలు అమర్చుతున్నారు. మేత, నీటి కోసం వస్తున్న వన్యప్రాణులు ఆ తీగలకు తగులుకుని మృత్యువాత పడుతున్నాయి. ఫలితంగా రోజురోజుకీ వన్యప్రాణుల సంఖ్య క్షీణిస్తోంది. ఐదేళ్లలో 12 ఏనుగులు, మూడు చిరుతలు మృతి 2013 నుంచి 2017వ సంవత్సరం మధ్య కాలంలో పది ఏనుగులు నీటి దొనల్లో పడి, విద్యుత్ షాక్, వ్యవసాయ బావులు మృతి చెందాయి. గతేదాడి కుప్పం సమీపంలోని తమిళనాడు సరిహద్దులో రెండు ఏనుగులు విద్యుదాఘాతానికి బలయ్యాయి. ఇటీవల ఎర్రావారిపాళెం మండలం కోటకాడిపల్లె వద్ద ఓ ఏనుగు మృతి చెందింది. చిరుతల విషయానికొస్తే గత జనవరిలో బంగారుపాళెం మండలం పెరుమాళ్లపల్లె అటవీ ప్రాంతంలో ఓ చిరుత వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని మృతి చెందింది. ఐరాల మండలం మల్లార్లపల్లె వద్ద ఓ చిరుత వేటగాళ్ల ఉచ్చుకు చిక్కింది. దీన్ని జూకి తరలించగా మృతి చెందింది. తాజాగా కుప్పం సరిహద్దులోని క్రిష్ణగిరి వద్ద ఓ చిరుతను ఓ వ్యక్తి కత్తితో నరికి చంపేశాడు. ఇప్పటికైనా అటవీశాఖ తగుచర్యలు తీసుకోవాల్సి ఉంది. -
పులి.. కలకలం
చెన్నారావుపేట(నర్సంపేట): మండలంలోని ఎల్లాయగూడెం శివారు మాధవనగర్ కాలనీలోని వ్యావసాయ బావిలో చిరుత మృతదేహం శనివారం లభించింది. కాలనీకి చెందిన కౌలు రైతు మంచాల బక్క సదయ్య తను సాగు చేసిన మొక్కజొన్న చేనుకు శనివారం నీళ్లు కడుతుండగా వ్యవసాయ బావి నుంచి దుర్వాసన రావడంతో వెళ్లి చూశాడు. బావిలో చిరుతపులి కనిపించడంతో విషయం గ్రామస్తులకు చేరవేయగా మంచాల శ్రీను, టేకుల స్వామి, పొలిశెట్టి రాజు, సదిరం వెంకన్న, సదిరం వినయ్ అక్కడికి చేరుకుని పరిశీలించి అది పులేనని నిర్ధారించారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చినా రాలేదని వారు చెప్పారు. వారం రోజుల క్రితం చూశాం వారం రోజుల క్రితం చిరుతపులితోపాటు రెండు పిల్లలను మామిడి చెట్టు కింద చూశాను. కాలనీ వాసులకు తెలుపడంతో వారు కూడా వచ్చి చూశారు. శనివారం మొక్కజొన్న చేనుకు నీళ్లు పెడుతుండగా బావిలో వస్తోందని రైతు సదయ్య చెబితే వెళ్లి చూశాం. బావిలో చిరుతపులి మృతదేహం నీటిలో తేలి ఉంది. మిగతా రెండు చిరుతలు ఎక్కడున్నాయో.. భయంగా ఉంది. – మాసాని ప్రసంగి, రైతు భయం.. భయంగా గడుపుతున్నాం చిరుత పులులు వ్యవసాయ బావి వద్ద కనిపించినప్పటి నుంచి భయం.. భయంగా గడుపుతున్నాం. వ్యవసాయ పనులకు కూలీలు రావడం లేదు. రైతులు కూడా ఉదయంపూటనే పంటలకు నీళ్లు పెట్టుకుంటున్నారు. ఫారెస్ట్ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదు. – టేకుల స్వామి, కాలనీవాసి -
చిరుతను మెడపట్టి.. చితక్కొట్టి.. చంపేశారు!
చిరుతపులి కనబడితే ఏం చేస్తారు.. భయంతో పారిపోతారు, లేదా దాన్ని భయపెట్టి తరిమేయడానికో ప్రయత్నిస్తారు. అంతేగానీ దాన్ని చంపేసే ప్రయత్నం ఎవరైనా చేస్తారా? ఢిల్లీ శివార్లలోని గుర్‌గ్రామ్ వాసులు మాత్రం సరిగ్గా అలాగే చేశారు. సాహసోపేతంగా వ్యవహరించిన ఓ యువకుడు దాని మెడపట్టి గట్టిగా బంధించగా, మిగిలినవాళ్లంతా కర్రలతో కొట్టి మరీ దాన్ని చంపేశారు. తర్వాత గ్రామంలో దాని మృతదేహాన్ని ఊరేగించారు. ఈ ఘటనతో కొన్ని గంటల పాటు ఊరంతా భయంతో వణికిపోయింది. ఉదయం 8.10 గంటల సమయంలో ఈ చిరుతపులి గుర్‌గ్రామ్ సమీపంలోని మండవర్ గ్రామంలోకి ప్రవేశించింది. దాదాపు మూడు గంటల పాటు అక్కడే తిరిగింది. కాసేపటి వరకు ఎవరూ దాని సమీపానికి వెళ్లడానికి కూడా సాహసించలేదు. ఎట్టకేలకు ఉదయం 11.45 గంటల ప్రాంతంలో దాన్ని తరుముకుంటూ ఒక ఖాళీ ఇంటిలోకి వెళ్లేలా చేశారు. కానీ అది అక్కడినుంచి ఇంటి పైకి ఎక్కడమే కాక, అక్కడ ఉన్న ఓ అమ్మాయి మెడ మీద పంజా విసిరింది. దాంతో అక్కడే ఉన్న ఓ యువకుడు ధైర్యంగా ముందుకెళ్లి వెనక నుంచి దాని మెడ గట్టిగా పట్టుకున్నాడు. మిగిలినవాళ్లంతా కలిసి దాన్ని కర్రలతో కొట్టి చంపేశారు. ఈ ఘటనలో గాయపడిన గ్రామస్తులను సమీపంలోని సోహ్నా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆరావళి పర్వత శ్రేణుల ప్రాంతాల్లో ఉన్న చిరుతలు ఇటీవలి కాలంలో తరచు గ్రామాల్లోకి వస్తున్నాయి. తాము కూడా చిరుతను చంపకపోయేవాళ్లమని, కానీ పోలీసులు.. అటవీ శాఖాధికారుల వద్ద కనీసం మత్తు ఇంజెక్షన్లు కూడా లేవని, కేవలం ఒక వలతో వచ్చారని గ్రామస్తులు చెప్పారు. చిరుత దాడితో గ్రామంలో ఏడుగురు గాయపడినా పోలీసులు చూస్తూ ఊరుకున్నారు తప్ప ఏపమీ చేయలేదని దేవేందర్ సింగ్ అనే గ్రామవాసి మండిపడ్డారు. -
ఉద్దగట్ట సమీపంలో చిరుత మృతి
పావగడ: కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకాలోని ఉద్దగట్ట గ్రామ సమీపంలోని కొండలో చిరుత మృతి చెందిన సంఘటన ఆదివారం వెలుగు చూసింది. అనారోగ్యంతో చనిపోయిందా లేదా ఎవరైనా వేటగాళ్లు చంపేశారా అనేది తేలాల్సి ఉంది. నెలరోజుల క్రితం ఓ చిరుత, ఎలుగు బంటి మృతి చెందాయని గ్రామస్తులు తెలిపారు. అటవీ అధికారుల నిర్లక్ష్యం వల్లే వన్యప్రాణులు మృతి చెందుతున్నాయని ఆరోపిస్తున్నారు. -
చిరుతలను చంపిందెవరు?
చండ్రుగొండ: ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం అబ్బుగూడెం అడవుల్లో ఆదివారం రెండు చిరుతపులులు మృతి చెందిన ఘటనపై అటవీశాఖ అధికారులు సీరియస్‌గా స్పందించారు. అటవీశాఖలోని యాంటీ పోచింగ్ స్క్వాడ్ రాష్ట్ర అధికారి ఆర్. మల్లికార్జుననాయక్, ఫ్లయింగ్ స్క్వాడ్ జిల్లా అధికారి యు. కోటేశ్వరరావు మండలంలో సోమవారం పర్యటించారు. రెండు చిరుతలు చనిపోయి ఉన్న ప్రాంతాన్ని, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, పలు ఆధారాలను సేకరించారు. అబ్బుగూడెం, సీతాయిగూడెం గ్రామస్తులు, రైతులు, పశువుల కాపరులతో మాట్లాడారు. అయితే, పథకం ప్రకారమే అబ్బుగూడెం అటవీప్రాంతంలోని చిరుతలపై విష ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. చిరుతల వేటకు ఓ మేకను బలి ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. తల్లి చిరుతతో పాటు పిల్ల చిరుత కడుపులో మేకమాంసం, దాని అవశేషాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. -
శ్రీశైలం ఘాట్‌లో చిరుత కూన మృతి
శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలం-సున్నిపెంట మార్గమధ్యంలోని ఘాట్‌రోడ్డులో సున్నిపెంటకు వెళ్లే మొదటి టర్నింగ్ వద్ద సోమవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుత కూన మృతి చెందింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉదయ్‌దీప్ ఘటనా స్థలానికి చేరుకుని కళేబరాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెంది ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కూన వయస్సు 6 నుంచి 8 నెలలు ఉండవచ్చన్నారు. -
సింహాచలం ఆలయ సమీపంలో చిరుత మృతి