అడవి తగలబడుతోంది..ఆర్పేవారేరీ.. | Mahabubabad District Near Gunjedu Forest Is Burning With Fire | Sakshi
Sakshi News home page

అడవి తగలబడుతోంది..ఆర్పేవారేరీ..

Published Thu, Apr 7 2022 3:40 AM | Last Updated on Thu, Apr 7 2022 8:40 AM

Mahabubabad District Near Gunjedu Forest Is Burning With Fire - Sakshi

కొత్తగూడ: మహబూబాబాద్‌ జిల్లా గూడూరు రేంజ్‌ పరిధి కొత్తగూడ మండలం గుంజేడు సమీపంలో కార్చిచ్చుకు వందలాది ఎకరాల్లో అడవి దగ్ధమవుతోంది. నిత్యం అటవీ శాఖాధికారులు సంచరించే ప్రధాన రహదారి మొత్తం పొగ కమ్ముకుని మంటలు ఎగిసి పడుతున్నాయి.

మూడు రోజులుగా మంటలు ఎగసి పడుతున్నాయని పశువుల కాపర్లు తెలిపారు. అడవుల్లో మంటలు ఆర్పేందుకు ప్రత్యేక పరికరాలున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు తునికాకు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అడవుల దహనానికి పాల్పడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement