కరోనా బాధితురాలికి ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సాయం | MP Asaduddin Owaisi Help To Corona Patient Oxygen Concentration | Sakshi
Sakshi News home page

కరోనా బాధితురాలికి ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సాయం

Published Sat, May 29 2021 8:40 AM | Last Updated on Sat, May 29 2021 8:40 AM

MP Asaduddin Owaisi Help To Corona Patient Oxygen Concentration - Sakshi

ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ను తీసుకెళ్తున్న దారుసలాం బృందం

చాదర్‌ఘాట్‌: కరోనాతో ఇబ్బంది పడుతున్నా... ఆదుకోండని శుక్రవారం ట్విట్టర్‌లో మహిళ చేసిన అభ్యర్థనకు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వెంటనే స్పందించారు. పార్టీ నాయకులను అప్రమత్తం చేసి వారితో వెంటనే ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ను పంపించారు. వివరాలివీ... ఓల్డ్‌మలక్‌పేటలో నివసించే మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హోంఐసోలేషన్‌లో ఉంటుంది. శుక్రవారం ఉదయం తనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని ఆదుకోవాలని ఆమె హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీని ట్విట్టర్‌లో అభ్యర్థించింది.

వెంటనే స్పందించిన ఆయన దారుస్సలాం నుంచి ఒక బృందాన్ని మలక్‌పేటకు పంపించారు. మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల, ఓల్డ్‌మలక్‌పేట ఎంఐఎం అధ్యక్షుడు షఫీయుద్దీన్‌లు ఆ బృందాన్ని తీసుకొని మహిళ ఇంటికి వెళ్లి ఎంపీ అసద్‌ పంపిన ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ను ఆమెకు అందజేశారు. మహిళ అభ్యర్థనకు వెంటనే స్పందించి సహాయం చేసిన ఎంపీకి డివిజన్‌వాసులు కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి: తండ్రికి బ్లాక్‌ఫంగస్‌.. కుమారుడికి టోకరా! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement