సాక్షి, హైదరాబాద్: రెండో దశ మహమ్మారి వ్యాప్తితో దేశంలో అల్లకల్లోల పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ అందక అర్థంతరంగా కోవిడ్ బాధితులు కన్నుమూస్తున్నారు. తమ వారిని కోల్పోయిన ఎంతోమంది కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కొంతమంది వివాహాలు, వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాలతో చెలగాటమడుతున్నారు. పార్టీలు, ఫంక్షన్ల పేరుతో వందలాది మంది ఒకచోట గుమిగూడి కరోనాను కోరి తెచ్చుకుంటున్నారు.
ఇక కరోనా విజృంభణలోనూ బాధ్యతా రాహిత్యంతో పెళ్లిళ్లకు ఫంక్షన్లకు వెళ్తున్నారు జనాలు. సంబరంగా పెళ్లి వేడుకకు వెళ్తే ప్రమాదం తప్పదని గ్రహించాలి. కోవిడ్ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మాయదారి కరోనా వ్యాపిస్తూనే ఉంది. కొందరు పాజిటివ్ వ్యక్తులు సూపర్ స్ప్రెడర్‌లుగా మారిన ఘటనలూ ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఇంట్లోనే ఉండటం ఉత్తమం. అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లకపోడం మంచింది. బతికి ఉంటే వేడుకలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి జాగ్రత్తలు పాటిస్తూ మనల్ని, మన వాళ్లను కాపాడుకుందాం.
ఇక కరోనా వేళ ఏంటి ఈ పెళ్లి గోళ అంటూ బిత్తిరి సత్తి పరేషాన్ అవుతున్నాడు. పండుగలకు రమ్మని ఎవరూ ఇంటికి రాకుండా.. నేను ఇంట్లో లేను అని గోడల మీద రాస్తున్నడు. మేం మీ లగ్గాలకు రాలేం. పెళ్లికి వచ్చి ఆగం కాలేము. మీ లగ్గాలకు వచ్చినంక మా దినాలు అయితయ్ అని బుగులు పడుతున్నడు. వధూవరులకు వాట్సాప్‌లో శుభాకాంక్షలు చెప్తాం, కట్నాలు ఆన్‌లైన్‌లో పంపుతామని అంటున్నడు. కోపం కావద్దు. కాలం ఎట్లున్నదని హితులు పలుకుతున్నాడు.
చదవండి: ‘వైద్యం అందకే గంట వ్యవధిలో నా భర్త, తల్లిని కోల్పోయాను’
జనాలతో కప్ప గంతులు వేయించిన పోలీసులు.. ఎందుకంటే!
Comments
Please login to add a commentAdd a comment