Marriages in train
-
తస్మాత్ జాగ్రత్త: మీ లగ్గాలకు వస్తే మా దినాలు అయితయ్!
సాక్షి, హైదరాబాద్: రెండో దశ మహమ్మారి వ్యాప్తితో దేశంలో అల్లకల్లోల పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ అందక అర్థంతరంగా కోవిడ్ బాధితులు కన్నుమూస్తున్నారు. తమ వారిని కోల్పోయిన ఎంతోమంది కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కొంతమంది వివాహాలు, వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాలతో చెలగాటమడుతున్నారు. పార్టీలు, ఫంక్షన్ల పేరుతో వందలాది మంది ఒకచోట గుమిగూడి కరోనాను కోరి తెచ్చుకుంటున్నారు. ఇక కరోనా విజృంభణలోనూ బాధ్యతా రాహిత్యంతో పెళ్లిళ్లకు ఫంక్షన్లకు వెళ్తున్నారు జనాలు. సంబరంగా పెళ్లి వేడుకకు వెళ్తే ప్రమాదం తప్పదని గ్రహించాలి. కోవిడ్ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మాయదారి కరోనా వ్యాపిస్తూనే ఉంది. కొందరు పాజిటివ్ వ్యక్తులు సూపర్ స్ప్రెడర్లుగా మారిన ఘటనలూ ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఇంట్లోనే ఉండటం ఉత్తమం. అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లకపోడం మంచింది. బతికి ఉంటే వేడుకలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి జాగ్రత్తలు పాటిస్తూ మనల్ని, మన వాళ్లను కాపాడుకుందాం. ఇక కరోనా వేళ ఏంటి ఈ పెళ్లి గోళ అంటూ బిత్తిరి సత్తి పరేషాన్ అవుతున్నాడు. పండుగలకు రమ్మని ఎవరూ ఇంటికి రాకుండా.. నేను ఇంట్లో లేను అని గోడల మీద రాస్తున్నడు. మేం మీ లగ్గాలకు రాలేం. పెళ్లికి వచ్చి ఆగం కాలేము. మీ లగ్గాలకు వచ్చినంక మా దినాలు అయితయ్ అని బుగులు పడుతున్నడు. వధూవరులకు వాట్సాప్‌లో శుభాకాంక్షలు చెప్తాం, కట్నాలు ఆన్లైన్లో పంపుతామని అంటున్నడు. కోపం కావద్దు. కాలం ఎట్లున్నదని హితులు పలుకుతున్నాడు. చదవండి: ‘వైద్యం అందకే గంట వ్యవధిలో నా భర్త, తల్లిని కోల్పోయాను’ జనాలతో కప్ప గంతులు వేయించిన పోలీసులు.. ఎందుకంటే! -
ఇక ఖరీదైన రైళ్లలో పెళ్లిళ్లు
న్యూఢిల్లీ: వినూత్నంగా, విలాసవంతంగా వివాహం చేసుకోవాలనుకునే జంటలకు శుభవార్త. భారతీయ రైల్వేకు చెందిన క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ తమ లగ్జరీ రైళ్లను పెళ్లి వేడకులకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ కార్పొరేషన్ ప్రపంచ పర్యాటకుల కోసం లగ్జరీ, సెమీ లగ్జరీ రైళ్లను ఇప్పటికే నడుపుతున్న విషయం తెల్సిందే. వీటిలో అత్యంత ఖరీదైన మహారాజా ఎక్స్‌ప్రెస్ 8 రోజుల ప్యాకేజీపైనా ఢీల్లీ, ఆగ్ర, రంథంబోర్, జైపూర్, బికనూర్, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, బెలాసినార్ల కోటలు, చారిత్రక కట్టడాల సందర్శన కోసం పర్యాటకుల కోసం నడుపుతోంది. ఇప్పుడు పెళ్లిళ్ల కోసం మహారాజా ఎక్స్‌ప్రెస్‌తోపాటు ప్యాలెస్ ఆన్ వీల్స్, డెక్కన్ ఒడిస్సీ, గోల్డెన్ చారియట్, రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ రైళ్లను కేటాయించాలని కార్పొరేషన్ నిర్వహించింది. పెళ్లిళ్లకు, వేడికలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు రైలు డెకరేషన్‌ను మార్చేందుకు, అతిథులకు పసందైన విందు భోజనాలతోపాటు వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేసేందుకు నిపుణులైన ఈవెంట్ మేనేజర్లు ఉంటారని కార్పొరేషన్ సీనియర్ అధికారులు తెలిపారు. రైళ్లలో విహరిస్తూనే పెళ్లి చేసుకోవచ్చని, వధూవరుల హానిమూన్‌కోసం ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఉంటాయని వారు చెప్పారు. ఎన్నిరోజుల బస, ఉపయోగించుకునే వసతులు, ప్యాకేజీల ఆధారంగా రేట్లు ఉంటాయని వారు అన్నారు. విలాసవంతమైన రైళ్లలో ‘స్పా’ లాంటి సౌకర్యాలు కూడా ఉంటాయని, భారతీయులు, ప్రవాస భారతీయలకే కాకుండా విదేశీ జంటల వివాహాలకు కూడా తాము రైళ్లను కేటాయిస్తామని వారు చెప్పారు. తాము వినూత్నంగా త్వరలోనే ప్రారంభించనున్న ఈ స్కీమ్ విజయవంతమవుతుందన్న విశ్వాసంతో ఉన్నామని వారు చెప్పారు.