
పంజగుట్ట: రాష్ట్రంలోని అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులందరికీ ఈ నెల 28, 29 తేదీల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రెస్‌క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీగిరి విజయ్‌కుమార్ రెడ్డి, ప్రధానకార్యదర్శి రాజమౌళిచారిలు స్వాగతించి, కృతజ్ఞతలు తెలిపారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్, బషీర్‌బాగ్ యూనియన్ కార్యాలయం, ఎంసీహెచ్‌ఆర్‌డీ, చార్మినార్ యునానీ ఆసుపత్రి, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రుల్లో జర్నలిస్టులకు వ్యాక్సిన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.
చదవండి: Corona Vaccine: సూపర్ స్ప్రెడర్స్‌కు టీకా ఇలా
Comments
Please login to add a commentAdd a comment