సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక శాఖ నిర్వహిస్తున్న ఐకానిక్ వారోత్సవాల (ఆజాదీ కా అమృత్ మహోత్సవ్)ను పురస్కరిం చుకుని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు గతంలో పట్టుబడ్డ మాదక ద్రవ్యాలను బుధవారం ధ్వంసం చేశారు. కేంద్రమంత్రి నిర్మల సీతా రామన్ వర్చువల్‌గా పాల్గొన్న ఈ కార్య క్రమంలో హైదరాబాద్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు 29.35 కేజీల హెరా యిన్, 4,821 కేజీల గంజాయిని ధ్వంసం చేశారు. హైదరాబాద్ జోన్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ టాక్స్ కమిషనర్ బీవీ శివ కుమారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
రెండే ళ్లుగా థాయ్‌లాండ్, ఉగాండా, జింబా బ్వే, టాంజానియా, జాంబియా దేశాల నుంచి హైదరాబాద్‌కు రవాణా చేస్తున్న మాదక ద్రవ్యాలను హైదరాబాద్ విమానాశ్రయంలో డీఆర్‌ఐ సిబ్బంది పట్టుకున్నారు. ఇందులో 35 కేజీల హెరాయిన్, కొకైన్ ఉన్నాయి. హెరా యిన్ విలువ రూ.142 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. సిద్ధిపేట, ఎల్‌బీ నగర్, పెద్ద అంబర్ పేట తదితర ప్రాంతాల్లో 4,821 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు, దీని విలువ రూ.9.62 కోట్లు ఉంటుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment