ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హిమాయత్‌నగర్(హైదరాబాద్): బాడీ మసాజ్ కోసం ‘లొకాంటో’ స్పాసైట్‌లో సెర్చ్ చేసి యువకుడికి భారీ టోకరా వేశారు లొకాంటో ప్రతినిధులు. మసాజ్ చేసేందుకు అందమైన అమ్మాయిలను ఇంటికి పంపిస్తానంటూ మోసం చేశారు. గంటకు రూ. 2 వేల నుంచి రూ. 10 వేల వరకు చార్జ్ చేస్తారన్నారు. అందమైన అమ్మాయిని బట్టి రేటు ఉంటుందన్నారు. అందమైన అమ్మాయిల ఫొటోలు పంపి ఎర వేశారు.
ఇలా పలు దఫాలుగా అమాయకుడి నుంచి రూ. 1.90 లక్షలు కాజేశారు. అంత పంపినా మసాజ్‌కు అమ్మాయిని పంపకుండా కాలయాపన చేస్తుండటంతో మోసపోయినట్లు గుర్తించి సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.
ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో...
ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో తనని మోసం చేశారంటూ నగర వాసి మంగళవారం సిటీ సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించాడు. ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి రూ. 2.20 లక్షలు పెట్టుబడి పెట్టింగా.. ఒక్క రూపాయి కూడా లాభం రాలేదని ఫిర్యాదు చేశాడు.
క్రెడిట్ కార్డు అప్‌డేట్ పేరుతో...
క్రెడిట్ కార్డ్ అప్‌డేట్ పేరుతో తనని మోసం చేశారంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీవీవీ తెలుసుకుని ఓటీపీ చెప్పడంతో అకౌంట్‌లో నుంచి రూ. 1.02 లక్షలు కాజేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment