సూర్యాపేట క్రైం: అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ విద్యార్థి మృతిచెందాడు. జిల్లా కేంద్రం నల్లాల బావి ప్రాంతానికి చెందిన నరేంద్రుడి లింగమూర్తి–సుధారాణి కుమారుడు చిరుసాయి (22) ఉన్నత విద్య అభ్యసించేందుకు 11 నెలల క్రితం అమెరికాకు వెళ్లాడు. శనివారం రాత్రి షాపింగ్ ముగించుకొని కారులో తిరిగి ఇంటికి బయలుదేరిన సమయంలో ఇతడి కారును వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో సాయి మృతిచెందగా, నల్లగొండకు చెందిన మరో యువతికి తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్లిందని తెలిపారు. సాయి కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు, సంకినేని వరుణ్‌రావు పరామర్శించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో మాట్లాడి మృతదేహాన్ని ఇండియాకి తీసుకొస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
చదవండి: కరోనా ఆంక్షలు ఎత్తివేయడం అసాధ్యం!..హెచ్చరిస్తున్న అధ్యయనాలు
Comments
Please login to add a commentAdd a comment